S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/11/2017 - 01:05

గుంటూరు, నవంబర్ 10: నీరు అమృతతుల్యం. రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి. మరోవైపు అనావృష్టి.. గత ప్రభుత్వాల నిర్వాకంతో నీటి కష్టాలు ఎదుర్కొన్నాం. రాష్ట్ర విభజనతో రెండు అంశాలపై ఆందోళన చెందాం. దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడేందుకు ఆలోచన చేశాం. ఆ ఫలితమే పట్టిసీమ. పోలవరం ఓ మహాయజ్ఞంగా తలపెట్టాం. ఇక గోదావరి- పెన్నా అనుసంధానమే జీవితాశయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

11/11/2017 - 01:03

అమరావతి, నవంబర్ 10: లోకేశ్ మాట్లాడితే ఎన్ని తడబాట్లు, ఇంకెన్ని తొట్రుపాట్లు కనిపిస్తాయోనని కెమెరాలు, వీడియోలు ప్రసంగంపైనే ఒళ్లంతా కళ్లు చేసుకునేవి. విలేఖరులు చెవులు రిక్కిరించి వినేవారు. దానికి కారణం ఆయన ప్రసంగాల్లో తరచూ దొర్లే తప్పులు, తడబాట్లు, గతానుభవాలే! కానీ, యువనేత లోకేశ్ అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం అందుకు విరుద్ధంగా సాగింది.

11/11/2017 - 02:04

హైదరాబాద్, నవంబర్ 10: టి.టిడిపికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన ఎ. రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ తేల్చి చెప్పారు. పైగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ రాజీనామా లేఖ ఇవ్వలేదని రమణ ఖరాఖండిగా తెలిపారు.

11/10/2017 - 23:32

హైదరాబాద్, నవంబర్ 10: సొంత భవనాలు, స్థలాల వంటి స్థిర ఆస్తులు లేని 10 షెడ్యూల్ పరిధిలోకి వచ్చే సంస్థల విభజనతో పాటు ఢిల్లీలోని ఎపి భవన్ విభజన, స్టేట్ కేడర్ ఉద్యోగుల విభజనకు సబ్ కమిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర సలహా సంఘం శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది.

11/10/2017 - 03:55

ఖమ్మం, నవంబర్ 9: అనుమతులు లేకుండానే వ్యాపారాలు చేస్తూ తమ మాటలతో, చేతలతో అమాయక గిరిజనులను మోసం చేస్తున్న వైనమిది. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 12జిల్లాల్లో ఈ తరహా వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. రైతులు పోడు చేసుకొని పండించిన ధాన్యాన్ని వ్యాపారులు పడికట్టి నాణ్యతాలోపం పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలకు తెగుళ్ళు సోకి నష్టపోయిన రైతులకు ఇది మరింత ఇబ్బందిగా మారింది.

11/10/2017 - 03:16

భద్రాచలం టౌన్, నవంబర్ 9: అటు శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం.. ఇటు కోదండరాముని కోవెల.. మరోవైపు పంచాయతీ కార్యాలయం.. పక్కనే రక్షకభట నిలయం.. ఎడమవైపు నిత్యాన్నదాన సత్రం.. కుడివైపు అనుబంధ ఆలయాలు.. ప్రశాంత వాతావరణం ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మద్యం వ్యాపారులు తమకు అనువైనది ఎంచుకున్నారు. పుణ్యక్షేత్రమైన భద్రాద్రిలో ఇలాంటి దృశ్యాలకు లోటులేదు.

11/10/2017 - 02:28

హైదరాబాద్, నవంబర్ 9: ఖమ్మంలో సమీకృత స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, గనులు భూగర్భ శాఖామంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. గురువారం నాడు శాసనసభలో టి రామమోహన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, బయ్యారీం వద్ద ఇనుప ఖనిజం లభించే పరిమాణం, నాణ్యత చూస్తే నాణ్యత తక్కువగా ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందని మంత్రి చెప్పారు.

11/10/2017 - 02:25

హైదరాబాద్, నవంబర్ 9: ప్రముఖ ఐటిఎం గ్రూపు సంస్థ భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటిన్ ఆటగాడు, నాలుగవ వరల్డ్ సూపర్ టైటిల్ విజేత శ్రీకాంత్ కిడాంబితో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రెండు ఆశయాలతో ఈ భాగస్వామ్యం చేసుకున్నట్లు ఐటిఎం గ్రూప్ పేర్కొంది.

11/10/2017 - 02:21

చలిచలిరా గిలిగిలిరా
తెలవారెడు జామువేళ తేజము జిమ్మే
చలిమంటల దరి జేరుచు
నులివెచ్చని మంటకాగ నెయ్యము పెరుగున్

11/10/2017 - 02:16

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన 31 కొత్త జిల్లాలకు సంబంధించి వివాదాలు పరిష్కారమయ్యే వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ (టెట్)ను నిర్వహించవద్దని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను ఒక యూనిట్‌గా పరిగణించడానికి ప్రాతిపదికను తెలియచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Pages