S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/14/2016 - 08:00

ఏర్పేడు, జనవరి 13 : చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ప్రాంతంలో లారీలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎర్రకూలీలు బుధవారం నాడు తెల్లవారి జామున చెలరేగిపోయారు. తమను వెంటాడుతున్న టాస్క్ఫోర్స్ బృందంపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఎస్సై వాసు గాయపడ్డాడు. ఎర్రచందనం దుంగలతో పారిపోవడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపి ఒక మెకానిక్ షాపును ఢీకొన్నాడు.

01/14/2016 - 07:59

కడప, జనవరి 13: కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు 6వ యూనిట్ పనులు అధికారులు ప్రకటించినట్లు ఈ ఏడాది కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. రూ.3,500 కోట్ల ఖర్చుతో నిర్మించతలపెట్టిన 6వ యూనిట్ పనులు 2010లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టునాటికే పూర్తిసామర్థ్యంతో ఉత్పత్తి సాధించాలని జన్‌కో అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

01/14/2016 - 07:59

మక్కువ, జనవరి 13: చేతబడి అనుమానంతో భార్యాభర్తలను హత్యచేసి మృతదేహాలను కాల్చి బూడిద చేసి వాగులో కలిపేసిన దారుణం బుధవారం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. మక్కువ మండలం సీబిల్లి పెద్దవలస పంచాయతీ కొత్తకామునివలస గిరిజన గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.

01/14/2016 - 07:58

విజయవాడ, జనవరి 13: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ, విదేశాల్లోని తెలుగువారు భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను ఘనంగా చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కోటి 80 లక్షల పేద కుటుంబాల వారు పెద్ద పండుగను సంతోషంగా చేసుకోవాలన్నదే తమ అభిమతమని, గత ఏడాది వలనే ఈ ఏడాది కూడా వారికి చంద్రన్న సంక్రాంతి కానుకను అందజేశామన్నారు.

01/14/2016 - 07:43

హైదరాబాద్, జనవరి 13: నెల్లూరుకు చెందిన ఆనం సోదరులు ఆనం రాం నారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలతో పాటు వేలాది మంది కార్యకర్తలు తెలుగు దేశం పార్టీలో అధికారికంగా చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈనెల 17వతేదీన నాలుగు వేల మంది కార్యకర్తలు నాయకులతో సోదరులిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

01/14/2016 - 07:42

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో 14 నవజాత శిశు కేంద్రాలు (ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు) నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కేంద్రానికి కోటి ఆరు లక్షలు చొప్పున 14 కేంద్రాలకు 14.84 కోట్లు విడుదల చేసింది. ఈ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తారు. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద వీటిని నిర్మిస్తారు.

01/14/2016 - 07:41

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు గురుకులాల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ విద్యార్థులకు రానున్న రోజుల్లో కామన్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం 10 మందితో కూడిన కమిటీని నియమించిందని విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పి సిసోడియా చెప్పారు.

01/14/2016 - 07:40

విజయవాడ, జనవరి 13: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి వార్త అందించింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో ఈ నెల 16వ తేదీ నుంచి వైద్య సేవలు లభించబోతున్నాయి. సమన్వయం, సమాచారం లోపం వలన ఎవరికైనా హెల్త్‌కార్డులు లభించకపోతే దశలవారీగా అందేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

01/14/2016 - 07:39

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధిస్తేనే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, భాగస్వామ్య సదస్సుల్లో కుదిరే అవగాహనా ఒప్పందాల వల్ల వ్యక్తిగతంగా పేరు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం చేకూరదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో లెక్కలేనన్ని అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు.

01/14/2016 - 07:23

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17న పల్స్‌పోలియో కార్యక్రమం చేపడుతున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ తెలిపారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేస్తూ, భారత్ నుండి పోలియో పూర్తిగా నిర్మూలించినప్పటికీ, సమీప దేశాల్లో ఇది ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యగా పల్స్‌పోలియో చేపడుతున్నట్టు వెల్లడించారు.

Pages