S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/30/2017 - 01:04

అమరావతి, సెప్టెంబర్ 29: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 75 పరిశ్రమలు శనివారం విజయదశమి రోజున ప్రారంభంకానున్నాయి. సిఎం, అధికార యంత్రాంగం గత రెండేళ్ల నుంచి చేసిన కసరత్తు ఫలించినట్టయింది. నవ్యాంధ్రను దేశంలోనే పారిశ్రామికీకరణలో అగ్రగామిగా నిలిపేందుకు సిఎం చంద్రబాబు 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఎఈ) నేడు విజయవాడ నగరంలో ప్రారంభించనున్నారు.

09/30/2017 - 01:08

అమరావతి, సెప్టెంబర్ 29: భూమినే నమ్ముకుని ఆరుగాలం కష్టపడే రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అందరం కలసి పనిచేద్దామని సిఎం చంద్రబాబు అన్నారు. సమష్టి శ్రమ ఫలితం ప్రపంచానికి రోల్‌మోడల్ కావాలన్నారు. శుక్రవారం సచివాలయంలో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సాగును లాభసాటిగా మార్చి, వ్యవసాయానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందన్నారు.

09/30/2017 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ అన్ని వేళలా ప్రజలకు స్ఫూర్తి నింపే సందర్భమని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజలుసుఖ సంతోషాలతో జీవించే విధంగా అమ్మవారు దీవించాలని ఆయన ప్రార్ధించారు.

09/29/2017 - 03:46

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాదికి మంచినీటి బెంగ తీరింది. శ్రీశైలం మల్లన్న సాక్షిగా శ్రీశైలం డ్యాంలో 150 టిఎంసి నీరు చేరింది. ఈ డ్యాం మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 215 టిఎంసి. దీంతో కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న రెండు రాష్ట్రాల్లో 30 మున్సిపాలిటీలు, వేలాది గ్రామాలు, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ దాహార్తి తీరనుంది.

09/29/2017 - 03:32

తిరుపతి, సెప్టెంబర్ 28: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు గురువారం ఉదయం శ్రీరాముని అవతారంలో స్వామి వారు తనకు అత్యంత ప్రియ భక్తుడైన హనుమంతునిపై తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

09/29/2017 - 03:27

ఖమ్మం, సెప్టెంబర్ 28: నక్సలైట్ల వార్తల సేకరణకు వచ్చే జర్నలిస్టులపై కఠినంగా ఉండాలని ఛత్తీస్‌గడ్ పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల చెప్పినట్టుగా వచ్చిన ఒక ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పాత ఖమ్మం జిల్లాకు చెందిన పాత్రికేయులు కవర్ చేస్తుంటారు.

09/29/2017 - 03:26

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మావోయిస్టు పార్టీకి కొత్త నాయకత్వం వస్తోంది. వామపక్ష తీవ్రవాదం సిద్ధాంతానికి పెట్టని కోటగా నిలిచి దేశంతో అరడజను రాష్ట్రాల్లో పట్టుసంపాదించిన సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వానికి వయోభారం మీదపడింది. కొత్త నాయకత్వంతో పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది.

09/29/2017 - 03:18

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో చెలరేగిన మంటల్లో కాలి బూడిదయింది. మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని అంకిరెడ్డిపల్లి, పెద్దమ్మ చెరువు వద్ద గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. హకీంపేట్ వైమానిక శిక్షణ కేంద్రం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో పైలట్‌తో పాటు మరో ఇద్దరు శిక్షకులు ఉన్నారు.

09/29/2017 - 03:14

విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 28: తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగాలని బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు.

09/29/2017 - 03:11

హైదరాబాద్, సెప్టెంబర్ 28: విజయవాడకు చెందిన శ్రీ ఉమా చిట్‌ఫండ్ కంపెనీ యాజమాన్యానికి , ఖాతాదారులకు మధ్య జరుగుతున్న వివాదంలో లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం నాడు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి వి నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎం ఎస్ కె జైస్వాల్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.

Pages