S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/27/2017 - 01:25

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రస్తుతం జాతీయస్థాయిలో పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఏప్రిల్ 1నుంచి మార్చి 31 వరకు ఆర్ధిక సంవత్సరం విధానానే్న కొనసాగించాలని కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన సమాచారంలో సూచించింది. ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండాలని కొద్దికాలం క్రితం కేంద్రం ప్రతిపాదించటం తెలిసిందే.

09/27/2017 - 01:23

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యతవున్న వాహనసేవే గరుడ వాహన సేవ. ఈనెల 23న ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అయితే స్వామివారికే అత్యంత్ర ప్రీతిపాత్రమైన గరుడ సేవ రోజున మాత్రం ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది.

09/27/2017 - 02:17

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన లక్ష ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.

09/27/2017 - 01:20

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: ఆంధ్ర, ఒడిశా బోర్డర్ (ఎఒబి)ను ఆనుకుని ఉన్న మూడు జిల్లాలను అనుసంధానిస్తూ కేంద్రం కొత్తగా ఒక జాతీయ రహదారిని మంజూరుచేసింది. ఈ రోడ్డు తూర్పు గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో తొలి జాతీయ రహదారి కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రహదారి నిర్మాణం వల్ల మన్య ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు అనుసంధానమవుతాయి.

09/26/2017 - 03:44

తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన సోమవారం ఉదయం 9గంటలకు సింహ వాహనంపై స్వామివారు యోగ నరసింహావతారంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.

09/26/2017 - 03:13

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. బంగాళాఖాతంలో తుపాను ద్రోణి ఏర్పడి ఉండటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. దీని ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో చాలాప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

09/26/2017 - 03:12

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు, దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి-కాకినాడ టౌన్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతుందని ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 07942 తిరుపతి-కాకినాడ టౌన్, ట్రైన్ ఈనెల 27న తిరుపతి నుంచి సా.గం. 10:00లకు బయలు దేరి, 29న ఉ.గం. 05:30లకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

09/26/2017 - 03:06

హైదరాబాద్, సెప్టెంబర్ 25: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు మరోమారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇండో యురోపియన్ బిజినెస్ ఫోరం (ఐఇబిఎఫ్) ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. నవంబర్ 17న లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేస్తారు.

09/26/2017 - 02:18

హైదరాబాద్, సెప్టెంబర్ 25: అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్ కేసుల్లో సమగ్రంగా, సంపూర్ణంగా దర్యాప్తు జరిగేందుకు వాస్తవ స్థితిగతులపై నివేదిక ఇచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు కమిటీలను నియమించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది.

09/26/2017 - 02:17

హైదరాబాద్, సెప్టెంబర్ 25: కట్టుకున్న భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడో ప్రబుద్ధుడు. భార్యకు నీలి చిత్రాలు పంపించిన ఓ సైకో భర్తను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లాకు చెందిన చిలకపాటి సునీల్‌కుమార్ ఒడిశాలోని పారాదీప్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నాడు.

Pages