S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/03/2017 - 01:54

హైదరాబాద్, అక్టోబర్ 2: ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్య కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడిన నిందితులను హైకోర్టు సోమవారం నాడు నిర్ధోషులుగా ప్రకటించింది. రాజకీయ ఒత్తిళ్లతోనే కేసులో బాధితులను నిందితులుగా చేర్చారని తీవ్రమైన వ్యాఖ్యలను హైకోర్టు చేసింది.

10/03/2017 - 01:12

శ్రీశైలం, అక్టోబర్ 2: శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం 877.70 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 176.74 టిఎంసిల నీరు ఉంది.

10/03/2017 - 02:50

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో సోమవారం అనుకోకుండా బలంగా మారడంతో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మెదక్, వరంగల్ తదితర జిల్లాల్లో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది.

10/03/2017 - 20:37

హైదరాబాద్, అక్టోబర్ 2: ‘కేవలం మాటలతో కాలం వెళ్ళబుచ్చడం కాదు, ప్రజా జీవితంలో 40 సంవత్సరాలుగా ఉన్న అనుభవానికి తోడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంతో ప్రజలకు ఏమి చేయాలన్న దానిపై స్పష్టత ఉంది. తెలంగాణ కోసం ఏమి చేస్తే బాగుంటుందో అధ్యయనం చేసాం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు.

10/03/2017 - 00:52

విజయవాడ, అక్టోబర్ 2: రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ వేదికగా సోమవారం రెండో సంవత్సర చంద్రన్న బీమా కార్యక్రమ ప్రారంభం, ఎన్టీఆర్ లక్ష గృహ ప్రవేశాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సిఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

10/02/2017 - 23:55

ఖమ్మం, అక్టోబర్ 2: సమైక్యవాదుల పాలనలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

10/02/2017 - 23:55

విశాఖపట్నం, అక్టోబర్ 2: ఒడిశా నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలియచేసింది. దీని ప్రభావం వలన ఏపి, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు.

10/02/2017 - 23:07

హైదరాబాద్, అక్టోబర్ 2: సింగరేణిని ప్రైవేటీకరించే యోచన లేదని రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని అన్నారు. సింగరేణి ఓటర్లు చాలా తెలివైన వారని , సింగరేణి ఎన్నికల తర్వాత తమ నిర్ణయాలు ప్రకటిస్తామని చెప్పారు. కోదండరాం ద్రోహి అని నాయని పేర్కొన్నారు.

10/02/2017 - 03:44

శ్రీశైలం, అక్టోబర్ 1: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం భ్రమరాంబిక అమ్మవారు నిజాలంకరణ రూపంలో, స్వామి అమ్మవార్లు నందివాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.

10/02/2017 - 03:26

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగి మూడేళ్లు పూర్తయినా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విభజన ప్రక్రియ కొలిక్కిరాలేదు. ఎక్కడి వివాదాలు అక్కడే ఉన్నాయి. పరిష్కారం చూపేందుకు నియమించిన షీలా బేడీ కమిటీకి కాలపరిమితి పూర్తయిన తర్వాత నాలుగుసార్లు కొనసాగింపు ఇచ్చినా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు.

Pages