S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/29/2017 - 01:03

భద్రాచలం, సెప్టెంబర్ 28: గోదావరి నదిపై జల రవాణాకు మార్గం సుగమమైంది. బ్రిటిష్ కాలం నాడే గోదావరి నదిలో సాగిన జలరవాణా కాలక్రమేణా రహదారులు, రైలు మార్గాలు ఏర్పడటంతో కనుమరుగైంది.

09/29/2017 - 01:00

అమరావతి, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చరమ గీతం పాడామని, మిగులు విద్యుత్ కారణంగా భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండో దశ సంస్కరణలు ఫలాలు ప్రజలు అందిస్తున్నామని, మూత పడిన పరిశ్రమలు తెరచుకున్నాయని తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం బహిరంగ లేఖను గురువారం రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

09/28/2017 - 19:52

విజయవాడ, సెప్టెంబర్ 26: ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఆరో రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్టి మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది.

09/27/2017 - 03:39

శ్రీశైలం, సెప్టెంబర్ 26: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ భ్రమరాంబాదేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు హంస వాహన సేవ నిర్వహించారు. శ్రీ భ్రమరాంబను ప్రత్యేక పూలు నూతన వస్త్రాలతో కాత్యాయనిదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ఆశీనులనుచేసి హారతులు ఇచ్చారు.

09/27/2017 - 03:37

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై శ్రీ రామజన్నార్ స్వామివారి అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9గంటలకు స్వామివారు కల్పవృక్షవాహనంపై ముందు కదులుతుండగా వాహనం ముందు గజరాజులు, వృషభ, అశ్వ, పదాతి దళాలు ముందుకు సాగాయి.

09/27/2017 - 02:14

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి ఆలయ ఓఎస్‌డిగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి మంగళవారం స్వల్ప అస్వస్తతకు గురయ్యారు. షుగర్ లెవెల్ పడిపోవడంతో ఆయన నీరసించారు. దీంతో డాక్టర్లు ఆయనకు అర్చకుల నిలయంలోనే చికిత్స అందిస్తున్నారు. వాస్తవానికి ఉదయం జరిగే కల్పవృక్ష వాహన సేవకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు అంటున్నారు.

09/27/2017 - 01:50

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కార్మిక, ఫ్యాక్టరీల శాఖలో వివిధ క్యాటగిరికి చెందిన 247 పోస్టుల డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

09/27/2017 - 01:49

హైదరాబాద్, సెప్టెంబర్ 26: పార్లమెంట్ సభ్యుల అభివృద్ధి నిధులు (ఎంపి లాడ్స్) ఇకనుంచి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ఈమేరకు కేంద్రం గత 18న మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపి లాడ్స్ నుంచి ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం నిధులు తప్పనిసరిగా ఖర్చు చేయాలన్న నిబంధనను విధించింది.

09/27/2017 - 01:47

జనగామ టౌన్, సెప్టెంబర్ 26: జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మోని (బతుకమ్మ) కుంటలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదంగా మారుతున్నాయి. పురాతన కాలం నాటి కుంటకు సంబంధించిన విలువైన భూమిని ఆక్రమణకు గురికాకుండా మరమతు చేసి జిల్లా కేంద్రానికి ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుండగా తనపై అభాండాలు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంటున్నారు.

09/27/2017 - 01:45

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ ఆడపడచులు ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకునే బతుకమ్మ పండగకు మంగళవారం ఎల్‌బి స్టేడియంలో సరికొత్త సొబగు చేకూరింది. రెండేళ్లుగా నిర్వహిస్తున్న ‘మహాబతుకమ్మ’ కొనసాగింపుగా ముచ్చటగా మూడోపర్యాయం మహాబతుకమ్మ నిర్వహించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి వచ్చిన దాదాపు 30 వేల మంది మహిళలు పాల్గొన్నారు.

Pages