S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/02/2017 - 01:06

చిత్రం..ఏపీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురంలో ఆమె కుమారుడి వివాహానికి హాజరైన సందర్భంలో కరచాలనం చేసుకుంటున్న తెలుగు రాష్ట్రాల సిఎంలు చంద్రబాబు, కెసిఆర్

09/30/2017 - 03:30

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: దసరా పండుగ సందర్భంగా నడుపుతున్న రైళ్లన్నీ రద్దీగానే నడుస్తున్నాయి. అధికారులు ఊహించని విధంగా రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎన్ని రైళ్లు ప్రవేశపెట్టినా ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు. సామాన్యులకు బెర్తు కన్ఫర్మేషన్ అందని ద్రాక్షగా మారిపోతోంది. ఈ పరిస్థితుల నుంచి కొంతవరకైనా ఉపశమనం కల్పించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

09/30/2017 - 03:03

భీమవరం, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్టవ్రృద్ధిలో ప్రథమస్థానంలో నిలుస్తున్న ఆక్వా సాగు క్రమబద్ధీకరణలో భాగంగా అనధికార హేచరీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. సీడ్ దశలో వాడుతున్న యాంటీబయోటిక్స్ తదితర రసాయనాల కారణంగా రొయ్య ఎదిగి, ఎగుమతి చేసే సమయంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేని హేచరీలను సీజ్‌చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

09/30/2017 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 29: మరోమారు మోసం చేసేందుకు చూస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాయలో పడొద్దని అఖిలపక్ష నాయకులు సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ ని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో టిపిసిపి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు.

09/30/2017 - 01:31

వరంగల్, సెప్టెంబర్ 29: వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చా రు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజైన శుక్రవారం తెల్లవారుజామున నిత్యాహ్నికం నిర్వహించి భద్రకాళి మాతను మహిషాసురమర్దినిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

09/30/2017 - 01:24

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వద్ద జరుగుతున్న జలచౌర్యంపై కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు ఉదాసీనత ప్రదర్శించడంపై తెలంగాణ తీవ్ర నిరసన తెలిపింది. శుక్రవారం జలసౌధలో జరిగిన కెఆర్‌ఎంబి భేటీ వాడి వేడిగా సాగినా, నిర్ణయం లేకుండానే ముగిసిపోయింది.

09/30/2017 - 01:23

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పోతిరెడ్డిపాడుకు నీళ్లు కావాలంటే రిక్వెస్టు చేయాలి, అడుక్కోవాలి అంతే తప్ప దాదాగిరిగా తీసుకెళ్తామంటే కుదరదంటే కుదరదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కరాకండిగా తేల్చిచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా జల విద్యు త్ ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు, దీని నుంచి పోతిరెడ్డిపాడ్‌కు నీటిని ఎలా తీసుకెళ్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

09/30/2017 - 01:19

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: విజయ దశమి పండుగ వేళ దశాబ్దాల కల సాకారం కాబోతోంది. కల్వకుర్తి ప్రాంతానికి కృష్ణాజలాలు తాకబోతున్నాయ. దాదాపు మూడు దశాబ్దాల పాటు పోరాటాలు, ఉద్యమాలు ఏ ఎన్నికలు వచ్చినా నేతల మొదటి ప్రసంగం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గురించే . ఆ పోరాటాల ఫలితం నేడు సాకారమవుతున్న వేళ రైతాంగంలో కొత్త ఆశలు చిగురించనున్నాయి.

09/30/2017 - 01:15

హైదరాబాద్, సెప్టెంబర్ 29: సింగరేణిలో డిపెండెంట్ పేరిట కాకుండా కారణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిపెండెంట్ల ఉద్యోగాలను కొందరు కోర్టుల్లో అడ్డుకుంటున్నారని, దీంతో చట్టంలో కొద్దిపాటి మార్పుతో తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా చేస్తే కారణ్య నియామకాలకు ఏ కోర్టూ అభ్యంతరం చెప్పదన్నారు. దీనివల్ల ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోదని సిఎం హామీ ఇచ్చారు.

09/30/2017 - 01:05

అమరావతి, సెప్టెంబర్ 29: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల నుండి ప్రభుత్వ సమాచారాన్ని కాపాడేందుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అత్యుత్తమ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు.

Pages