S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/29/2017 - 03:10

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అడ్వాన్స్ పరీక్షను మే 20న నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్స్ బోర్డు నిర్ణయించింది. అడ్వాన్స్ పరీక్ష నిర్వహణకు అనుగుణంగా మెయిన్స్ ఫలితాలను ఏప్రిల్ 30 కంటే ముందే విడుదల చేస్తారు. అడ్వాన్స్ పరీక్ష ఫలితాలను జూన్ 11న వెల్లడించనున్నారు. జూలై మొదటి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది.

09/29/2017 - 03:09

హైదరాబాద్, సెప్టెంబర్ 28: నవంబర్ చివరి వారంలో ఆలిండియా డీజీపీల సదస్సు జరుగనుంది. మధ్యప్రదేశ్ వేదిక కానున్న ఈ సదస్సులో ఆలిండియా డీజీపీలు పాల్గొననున్నారు. ఈసారి ఏజెండాలో దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ సమస్యలు, అంతర్గత భద్రత, ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వం అందించే ఆధునీకరణ నిధులు వంటి అంశాలను రూపొందించినట్టు సమాచారం.

09/29/2017 - 01:53

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తుల స్ఫూర్తిదాయక విజయానికి దసరా పండుగ ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో తులతూగేలా ఆ దుర్గమ్మ తల్లి కరుణించాలని ఆయన ఆకాంక్షించారు.

09/29/2017 - 01:29

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేసిన ప్రయత్నానికి వర్షం ‘బ్రేక్’ వేసిం ది. రాష్ట్ర రాజధానిలోని ఎల్‌బి స్టేడియంలో దాదాపు ఆరువేల మంది మహిళలను తంగేడుపూవు ఆకారంలో నిలబెట్టాలని, అలాగే మూడువేల మందిమహిళల చేత అతివేగంగా బతుకమ్మను పూలతో రూపొందించాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రయత్నించింది.

09/29/2017 - 01:26

వెల్జాల చంద్రశేఖర్

09/29/2017 - 01:19

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించనున్నట్టు మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రకటించారు. మద్దతు ధరతో పాటు అకాల వర్షానికి తడిసిన మక్కలను కొనుగోలు చేయాలని వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలియగానే వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్‌తో మంత్రి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా వారి సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.

09/29/2017 - 01:15

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సౌర విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి తెలంగాణ ముందుకు దూసుకు వచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2,792 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. రాజస్ధాన్ 2,219 మెగావాట్లు ఉత్పత్తి చేయగా గుజరాత్ 1,384 మెగావాట్లు ఉత్పత్తి చేసింది.

09/29/2017 - 01:06

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సింగరేణి కార్మికులకు 2016-17 సంవత్సరం బోనస్‌తో పాటు, దీపావళి బోనస్‌లను కలిపి శుక్రవారం చెల్లిస్తామని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లాభాల బోనస్‌గా సింగరేణి లాభాల్లో 25 శాతం కార్మికులకు ఇస్తున్నామని, ఈ మొత్తం 98.84 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. దీపావళి

09/29/2017 - 01:05

కాకినాడ, సెప్టెంబర్ 28: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా, దళారుల హవాకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు భరోసా ఇవ్వనున్నాయి. దళారుల నుండి రైతులను రక్షించడానికి తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ ఖరీఫ్ సీజన్ నుండి అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

09/29/2017 - 01:03

అనంతపురం, సెప్టెంబర్ 28: అనంతపురంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మరో నలుగురు రోగులు మృతి చెందారు. బుధవారం 9 మంది రోగులు మృతి చిందగా, అర్ధరాత్రి మరొకరు చనిపోయారు. తాజాగా గురువారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా రోగుల బంధువుల్లో ఆందోళన నెలకొంది.

Pages