S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/02/2017 - 03:21

హైదరాబాద్, అక్టోబర్ 1: మావోయిస్టు పార్టీ 13 ఏళ్ల తర్వాత ఆత్మావలోకనం చేసుకుంటోంది. రానున్న రోజుల్లో పార్టీ కేడర్‌ను పటిష్టం చేసే విషయమై పార్టీ సెంట్రల్ కమిటీ దృష్టిని సారించింది.

10/02/2017 - 02:22

హైదరాబాద్, అక్టోబర్ 1: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లుకు ఆమోదం లభిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ భరోసా ఇచ్చారు. బిసిల పట్ల కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రధాని నరేంద్రమోదీ కూడా బిసిల డిమాండ్ల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు.

10/02/2017 - 01:55

పుట్టపర్తి, అక్టోబర్ 1 : త్వరలో పుట్టపర్తికి వచ్చి భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కెసిఆర్ ఆదివారం సత్యసాయి విమానాశ్రయం చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తాను త్వరలోనే మళ్లీ పుట్టపర్తికి వస్తానని, అప్పుడు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటానని తెలిపారు.

10/02/2017 - 01:53

శ్రీశైలం, అక్టోబర్ 1 : శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.7 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ఆదివారం నాటికి 166.7052 టిఎంసిలుగా నమోదైంది. ఇక ఎగువ ప్రాజెక్టులైన జూరాల నుంచి 1,11,698 క్యూసెక్కులు, రోజా ప్రాజెక్టు నుంచి 22,395 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతుంది.

10/02/2017 - 01:50

విశాఖపట్నం, అక్టోబర్ 1: రైల్వే స్టేషన్‌ల్లోని మేనేజర్ల హోదా పెరిగింది. ఇక నుంచి మేనేజర్‌కు బదులుగా స్టేషన్ డైరెక్టర్‌గా పిలుస్తారు. అయితే ఏ-వన్ రైల్వేస్టేషన్‌గా గుర్తింపుపొందిన స్టేషన్ మేనేజర్లను మాత్రమే స్టేషన్ డైరెక్టర్‌గా హోదా పెంచారు. ఈ అరుదైన అవకాశం విశాఖ రైల్వేస్టేషన్‌కు దక్కింది. ప్రయాణికులకు వౌలిక వసతులు కల్పించడంలో ముందుండడంతోపాటు స్వచ్ఛస్టేషన్‌గా అవార్డును పొందగలిగింది.

10/02/2017 - 01:26

హైదరాబాద్, అక్టోబర్ 1: కోటి ఎకరాల మాగాణి సంకల్పంతో తెరాస సర్కారు వేగంగా అడుగులేస్తోంది. పెద్ద, చిన్న ప్రాజెక్టులే కాదు.. వాగు వంకలనూ కలుపుకుని సాగుభూముల విస్తరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిపెట్టిన ప్రభుత్వం, భారీగా నిధుల కేటాయింపులతో రికార్డుస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉంది.

10/02/2017 - 01:21

హైదరాబాద్, అక్టోబర్ 1: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 166.32 టిఎంసికి చేరుకోవడంతో ఆ నీటిని వాడుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మాటల తీవ్రత పెంచాయి. వివాదాలకు తెరదించేందుకు నెలాఖరులోగా ఇద్దరు సిఎంలతో భేటీ నిర్వహించే యోచనలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశం జరిగింది.

10/02/2017 - 01:20

మునగాల, అక్టోబర్ 1: ఆర్టీసీ బస్సు మితిమీరిన వేగం ఆరుగురి ప్రాణాలను హరించింది. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మొద్దులచెర్వు గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది.

10/02/2017 - 01:09

అమరావతి, అక్టోబర్ 1: ఇంధన శాఖాధికారులు సమర్థ విద్యుత్ వినియోగ ఉపకరణాల ప్యాకేజీని ప్రజలకు సరసమైన ధరలకు అందించడంపై దృష్టి సారించాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్యాకేజీ పథకానికి 15 రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ప్యాకేజీలో ఇచ్చే ఉపకరణాలు విద్యుత్ సమర్థ వినియోగం ద్వారా బిల్లులు తగ్గించేలా ఉండాలని సూచించారు.

10/02/2017 - 03:42

తిరుపతి, అక్టోబర్ 1: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజైన ఆదివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు భూ వరాహస్వామి ఆలయం ప్రాంతంలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో చక్రధరునికి చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించారు.

Pages