S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/21/2017 - 21:42

అమరావతి, సెప్టెంబర్ 20: నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో దేశీయ ఉత్పత్తి వివరాలు ఈసారి నమోదు చేయగా, ఇకపై గ్రామస్థాయిలో గణాంకాలు సమర్పించడానికి సిద్ధంగా ఉండాలని సిఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ప్రతి త్రైమాసికంలో వచ్చే ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ‘ప్రగతి నివేదిక’లని అన్నారు. పాలనలో ఉత్తీర్ణత సాధించామా, లేదా? అనేది నివేదికలతో వెల్లడవుతుందన్నారు.

09/20/2017 - 03:48

ఖమ్మం, సెప్టెంబర్ 19: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన కార్మిక సంఘాలు తమ పార్టీలను ప్రచార రంగంలోకి దింపాయి. తమ అనుబంధ కార్మిక సంఘాలను గెలిపించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

09/20/2017 - 02:21

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల వీసా విధానాన్ని కఠినతరం చేయడంతో భారతీయ విద్యార్థుల దృష్టి మిగిలిన దేశాలపై పడింది. ప్రధానంగా తూర్పు ఆసియా దేశాలపైనా, రష్యా, ఐరోపా దేశాలు, బ్రిటన్‌పై పడింది. విదేశాల్లో దాదాపు 10 లక్షల మంది చదువుతుండగా, సగటున రెండు లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దాదాపు అదే సంఖ్యలో నేడు యుకెకు వెళ్తున్నారు.

09/20/2017 - 02:20

తిరుపతి, సెప్టెంబర్ 19: దేశంలోని బిసిలను అణచివేయాలని చూసినా, అన్యాయం చేయాలనుకున్నా మరో విప్లవం పుడుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం తిరుపతిలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను ఆర్.కృష్ణయ్య మీడియా సమావేశంలో వివరించారు.

09/20/2017 - 02:19

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. వైశ్యవర్గంపై ఐలయ్య రచించిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

09/20/2017 - 02:09

ఖమ్మం, సెప్టెంబర్ 19: జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్యకు ఆహ్వానం పలుకుతూ ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. వన సంరక్షణ, పర్యావరణాన్ని పరిరక్షించడంలో రామయ్య తనకు తానే సాటి.

09/20/2017 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (్ఫ్యను-ఎన్నికల గుర్తు) గాలి వీచేనా!?. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని ఎలా బలపరచాలన్న అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తర్జన-్భర్జన పడుతున్నది.

09/20/2017 - 01:54

హైదరాబాద్, సెప్టెంబర్ 19: కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉండేలా ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. అధ్యయన నివేదికను వారంలో సమర్పించాలన్నారు. జలమండలి, హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

09/20/2017 - 01:52

తెలంగాణ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ రాజాసదారాం, సమాచార కమిషనర్ బుద్దామురళి మంగళవారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతల స్వీకరణ తేదీ, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.

09/20/2017 - 01:48

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ వస్తే కరెంటు ఉండదు. పరిశ్రమలు తరలిపోతాయి. పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదు.. అంటూ చాలాకాలం సాగిన ప్రచారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గ్ధామమైంది. అసోచామ్ సర్వేతో రాష్ట్ర ప్రభుత్వంలో మరింత విశ్వాసం కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ఇస్తే ఆర్ధిక అరాచకం తప్పదన్న గత ప్రచారానికి తెరపడింది.

Pages