S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/19/2017 - 01:28

నూజివీడు, సెప్టెంబర్ 18: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వివిధ తరగతులు చదువుతున్న 54మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ వీరంకి వెంకటదాసు చెప్పారు. ఘటనకు కారకులైన ఆరుగురు విద్యార్థులపై శాశ్వత బహిష్కరణ వేటు వేశామన్నారు.

09/19/2017 - 01:25

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సదావర్తి ట్రస్టు భూముల వ్యవహారంలో ఆంధ్ర ప్రభుత్వం ఆలోచనలు తలకిందులయ్యాయి. చౌకగా సదావర్తి భూములను అందించాలన్న ప్రభుత్వ యోచన తలకిందులై న్యాయస్థానాల చుట్టూ తిరిగి చివరికి 60.30 కోట్ల రూపాయిలకు భూములు అమ్ముడుపోయాయి. సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి భూములు మూడింతలు ఎక్కువ ధర పలికాయి.

09/19/2017 - 01:23

హిందూపురం, సెప్టెంబర్ 18: లైంగిక వివక్షను రూపుమాపేందుకు కలిసికట్టుగా పోరాటం సాగిద్దామని ప్రముఖ సామాజిక సేవకుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. ప్రధానంగా బాలల హక్కుల పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సత్యార్థి చేపట్టిన భారతదేశ యాత్ర సోమవారం కర్నాటక రాజధాని బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది.

09/19/2017 - 01:21

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 18: కర్నూలు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40వ నెంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడటంతో మంటలంటున్నాయి. దీంతో కారులో ఉన్న మహిళ, ఇద్దరు చిన్నారులు కాలిబూడిదైపోయారు. మృతులు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులు. పోలీసుల కథనం ప్రకారం ప్రొద్దుటూరుకు చెందిన అన్నదమ్ములు నాగరాజు, రాజా డ్రైవర్లు.

09/19/2017 - 01:16

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ సోమవారం ఆమోద ముద్ర వేశారు. కొత్తగా డివిఎస్‌ఎస్ సోమయాజులు, పొట్లపల్లి కేశవరావు, మంతోజు గంగారావు, అభినంద్ కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్ గౌడ్, కొంగర విజయలక్ష్మిలను న్యాయమూర్తులుగా నియమించారు. ఈ నెల 21న కొత్త న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలిసింది.

09/19/2017 - 01:09

ఏలూరు, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో నీటి సమగ్ర వినియోగమే లక్ష్యంగా స్మార్ట్ వాటర్‌గ్రిడ్ దిశలో అడుగులు వేస్తున్నామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలవరం ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని, ఇది రాష్ట్రానికి జీవనాడిగానేకాక ప్రగతి చిహ్నంగానూ నిలుస్తుందన్నారు.

09/19/2017 - 00:58

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సంచలనం సృష్టించిన ఆయేషా మీర హత్య కేసును పోలీసులు తప్పుదారి పట్టించారని ఆమె తల్లిదండ్రులు సోమవారం నాడు హైకోర్టులో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఆయేషా తల్లిదండ్రులు ఇక్బాల్ బాషా, శంషాద్ బేగంలు హాజరయ్యారుఈ మేరకు వారి వాదనను న్యాయవాది డి సురేష్‌కుమార్ డివిజన్ బెంచ్ ముందు వినిపించారు.

09/18/2017 - 03:03

హైదరాబాద్, సెప్టెంబర్ 17: నవరాత్రి సందర్భంగా 21 నుంచి అక్టోబర్ 5 వరకు పది ఎక్స్‌ప్రెస్ రైళ్లను మైహర్ స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 11045 కొల్లాపూర్-్ధన్‌బాద్, ట్రైన్ నెం. 12669 చెన్నై-్ఛప్రా, ట్రైన్ నెం. 12791 సికిందరాబాద్-మైహర్, ట్రైన్ నెం. 12578 మైసూర్-దర్బంగా, ట్రైన్ నెం. 17610 పూర్ణ-పాట్నా, ట్రైన్ నెం.

09/18/2017 - 02:59

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి పలు చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

09/18/2017 - 02:50

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఆధునిక విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకుంటోదని, దాంతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌరసరఫరాల కమిషనర్ సి.వి. ఆనందర్ పేర్కొన్నారు.

Pages