S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/16/2017 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 15: యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ఐదో దశ నిర్మాణానికి అవసరమైన రూ.4009 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన నిధులు నూటికి నూరుశాతం సమకూరినట్టయ్యింది.

09/16/2017 - 01:57

హైదరాబాద్, సెప్టెంబర్ 15: అర్చకులకు తీపి కబురు. ఇక నుంచి ఉద్యోగులకు మాదిరిగా పే స్కేలు అమలు చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నవంబర్ నుంచే పే స్కేలు అమలవుతుందన్నారు. అలాగే దేవాలయాల నిర్వహణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయనున్నట్టు కెసిఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం అర్చకులతో సిఎం సమావేశమయ్యారు.

09/16/2017 - 01:25

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, లైన్ల నష్టాలు తగ్గించుకోవడం, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ అందించడంలో ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎపిఈపిడిసిఎల్) ప్రథమ స్థానంలో నిలుస్తోందని సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర స్పష్టం చేశారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయం ఛాంబర్‌లో శుక్రవారం సిఎండిగా బాధ్యతలు స్వీకరించారు.

09/16/2017 - 01:22

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణలో హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మంచినీటి అవసరాల నిమిత్తం 17.5 టిఎంసి నీటిని శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తాజాగా మరో లేఖ రాసింది. కృష్ణా బోర్డు రెండు రోజుల క్రితం 2 టిఎంసి నీటిని శ్రీశైలం నుంచి విడుదల చేయాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే.

09/16/2017 - 04:12

అమరావతి, సెప్టెంబర్ 15: 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 11.72 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషం. జాతీయస్థాయిలో తొలి త్రైమాసిక వృద్ధిరేటు 5.6 శాతంగా ఉంది. గడచిన 3 మాసాలకుగాను దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్ర రెండో స్థానంలో నిలిచింది.

09/16/2017 - 01:18

మైలవరం, సెప్టెంబర్ 15: ఆర్థిక సమస్యల నేపధ్యంలో ఓ కుటుంబం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కడప జిల్లా మైలవరంలో శుక్రవారం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నీట మునిగి చనిపోవడం సంచలనం రేపింది. మృతుల కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం జమ్మలమడుగు మండలం రాజీవ్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న షేక్ వాహిద్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు.

09/16/2017 - 01:52

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటిన తర్వాత ఎట్టకేలకు ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల పంపిణీ పంచాయితీలో ఏపీ నెగ్గింది. ఉమ్మడి రాష్ట్రాల్లోని విలువైన 14 ఆస్తుల పంపకాలకు సంబంధించిన ఒకే అంశంతో కూడిన అజెండాపై శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ భవన్‌లో ఏపిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మాలకొండయ్య అధ్యక్షతన కీలకమైన బోర్డు సమావేశం జరిగింది.

09/15/2017 - 03:08

శ్రీశైలం, సెప్టెంబర్ 14: శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం 833.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 52.89 టిఎంసిల నీరు ఉంది. జూరాల నుండి 16 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది.

09/15/2017 - 02:32

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ లేఖలో ప్రధాని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించే అద్భుతమైన కార్యక్రమం చేపట్టిందని ప్రధాని తన లేఖలో అభినందించారు.

09/15/2017 - 02:05

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు పెంచాలని, జవాబుదారీతనాన్ని తీసుకురావాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డితో పాటు ఉన్నతాధికారులు గురువారం నాడు గవర్నర్‌ను కలిసి కొత్త వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని, ప్రొఫెసర్ వి వెంకటరమణను పరిచయం చేయడంతో పాటు విద్యారంగ పరిస్థితులను వివరించారు.

Pages