S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/16/2017 - 04:58

హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో పంటలకు వర్షపు నీటిని అందించే నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజులు ఇటు అటుగా జూన్ 10న ఎపిలోనిఅనంతపురం, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (హైదరాబాద్ కేంద్రం) అంచనావేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇవి రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించే అవకాశాలు ఉన్నా యి.

05/16/2017 - 00:34

భీమవరం, మే 15: నగరాలు, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. మార్చి నెలాఖరున నిలిచిపోయిన 13వ ఆర్ధిక సంఘం నిధులను వినియోగించుకుని పట్టణాలు, పల్లెలను అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఈ నిధుల వినియోగానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గడువు పెంచుతూ ప్రభుత్వం సర్కులర్‌ను జారీ సింది.

05/15/2017 - 03:33

ఖమ్మం, మే 14: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు చేతకానివారని, అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో వారు ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

05/15/2017 - 03:25

విజయవాడ (క్రైం), మే 14: చిన్నారి మాదంశెట్టి సాయిశ్రీ (13) మృతి చెందింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సరైన వైద్యం అందక చివరికి తన జ్ఞాపకాలు తల్లికి వదిలి వెళ్లిపోయింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ క్షణక్షణం చావుకు చేరువవుతున్న తనను దయచేసి బతికిలంచాలంటూ ‘సెల్ఫీ’ వీడియో ద్వారా తండ్రి మాదంశెట్టి శివకుమార్‌ను సాయిశ్రీ ఇటీవల ప్రాధేయపడింది.

05/15/2017 - 03:18

హైదరాబాద్, మే 14: దండకారణ్యంలో సుక్మాలో 26 మంది సిఆర్‌పిఎఫ్ జవానులను మావోయిస్టులు ఊచకోత కోసిన ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎత్తున కోబ్రా కమాండోలను సిఆర్‌పిఎఫ్ మోహరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లుగా ఆపరేషన్ సమాధాన్‌కు రంగం సిద్ధమైంది. వేసవి కాలం మరో 40రోజు ల్లో ముగుస్తున్నందున, వర్షాకాలం ప్రారంభమైతే, గాలింపు చర్యలు చేపట్టడం కష్టమవుతుంది.

05/15/2017 - 02:55

తిరుపతి, మే 14: చిత్తూరు జిల్లా వడమాలపేట మం డలం పి బొమ్మరాజపురానికి చెందిన అడ్లూరు చంద్రశేఖర్‌రాజు, సుహాసినిల దంపతుల రెండవ కుమారుడు అడ్లూరు సాయికుమార్ (23) అమెరికాలోని ఇల్లినాయి స్ రాష్ట్రం డెక్లాంబ్ సిటీలో శనివారం రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువుల సమాచారం మేరకు డెక్లాంబ్ సిటీ లో ఇల్లీనాయిస్ యూనివర్శిటీలో సాయికుమార్ ఎమ్మెస్ చదువుతున్నారు.

05/15/2017 - 03:16

హైదరాబాద్, మే 14: రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం నుంచే పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాలో పాదయాత్ర చేపట్టడంతో పాటు గతంలో జనసేన శిబిరంలో పాల్గొన్న వారందరినీ స్వయంగా వచ్చి కొద్ది రోజుల్లో కలుస్తానని తెలిపారు.

05/15/2017 - 02:27

హైదరాబాద్, మే 14: ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ వివాదం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సోమవారం ‘్ఛలో ధర్నా చౌక్’కు పిలుపునిచ్చాయి.

05/15/2017 - 02:24

హైదరాబాద్, మే 14: ఉప్పల్ నుంచి హైదరాబాద్ నగరం నడిబొడ్డుకు సులువుగా చేరుకునే వీలు కల్పించే రెండు ప్రధాన ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న అంబర్‌పేట ఫ్లై ఓవర్‌తోపాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

05/15/2017 - 02:22

హైదరాబాద్, మే 14: నైరుతి రుతుపవనాలు నికోబార్ ద్వీపాలను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో విస్తరించాయి. సాధారణ గడువుకు మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు పలకరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకటించింది. రుతుపవనాలు బలంగా ఉండటంతో పాటు నైరుతీవైపు గాలులు బలంగా ఉండటంతో నికోబార్ ఐలాండ్స్, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి.

Pages