S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/18/2016 - 05:20

కాకినాడ, డిసెంబరు 17: ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే మందుల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని దివీస్ యాజమాన్యం తక్షణం నిలిపివేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని దానవాయిపేట గ్రామంలో దివీస్ మందుల కంపెనీ నిర్మాణానికి నిరసనగా శనివారం నిర్వహించిన బహిరంగ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

12/18/2016 - 03:25

హైదరాబాద్, డిసెంబర్ 17: పార్టీ ఫిరాయింపులపై సభలో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన కాంగ్రెస్, తెదేపా సభ్యులు 11మందిని శాసన సభ స్పీకర్ రోజుపాటు సస్పెండ్ చేశారు. తొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులు, ఇద్దరు తెదేపా సభ్యులను వేర్వేరుగా సస్పెండ్ చేశారు. అనంతరం సస్పెన్షన్‌లకు నిరసన వ్యక్తం చేస్తూ సిఎల్పీ నాయకుడు కె జానారెడ్డి వాకౌట్ చేశారు.

12/18/2016 - 03:21

హైదరాబాద్, డిసెంబర్ 17: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల వద్ద ఉండే బంగారంపై ప్రధాని దాడి చేయబోతున్నారన్న పుకార్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొట్టిపారేశారు. నోట్ల రద్దు అంశంపై శనివారం శాసన మండలిలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ సామాన్య మహిళల జోలికి వచ్చే ఆలోచన కేంద్రానికి లేదన్నారు.

12/18/2016 - 02:18

విశాఖపట్నం, డిసెంబర్ 17: ఫార్మా రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్న ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

12/18/2016 - 02:15

విశాఖపట్నం, డిసెంబర్ 17: దేశంలో న్యాయ విశ్వవిద్యాలయాలు పెరగాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

12/18/2016 - 02:05

హైదరాబాద్, డిసెంబర్ 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ అటాచ్‌మెంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాధికార సంస్థ ధ్రువీకరించింది. రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను ఇడి అటాచ్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులను ప్రాధికార సంస్థ సమర్థించింది.

12/18/2016 - 03:27

హైదరాబాద్, డిసెంబర్ 17: దేశవ్యాప్తంగా 14 ఎక్స్‌ప్రెస్ హైవేలు, 36 రింగ్‌రోడ్లు నిర్మించే యోచన ఉన్నట్టు ఉపరితల రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సు శనివారంనాటి కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. 11 నదుల్లో జల రవాణాకు గంగానదిపై 40 వాటర్ పోర్టులు నిర్మించాలన్న యోచనలో కేంద్రం ఉందని వివరించారు.

12/18/2016 - 01:58

హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ సీటు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన ఘరానా మోసగాడిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన మారంరాజు రాఘవరావు (62) సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురి, భాస్కరరావునగర్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ పరిసరాల పోలీస్ స్టేషన్లలో ఇతనిపై పలు చీటింగ్ కేసులు నమోదైవున్నాయి.

12/17/2016 - 04:50

తిరుపతి, డిసెంబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బస్సులో పొగలు రావడంతో ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో సిఎం సెక్యూరిటీ సిబ్బంది ముఖ్యమంత్రి బస్సు దిగి వేరొక కారులో తిరుపతికి చేరుకున్నారు.

12/17/2016 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు భూసేకరణ అందరి ఆమోదంతోనే చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం శాసన మండలిలో విద్యుత్ శాఖకు సంబంధించి పలువురు కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ ప్రాజెక్టులన్నీ పారదర్శకతతో ప్రభుత్వ సంస్థలకే ఇచ్చామన్నారు.

Pages