S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/18/2016 - 00:58

హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్‌లోని దుందిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో గురువారం జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఎయిర్ క్రాఫ్ట్‌లు కళ్లు మిరుమిట్లుగొల్పాయి. ఒళ్లు గగుర్పొచే విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ ప్రముఖ ఏరోబోటిక్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలను వేలాది విద్యార్థులు, విమానయాన శాఖ అధికారులు, కుటుంబ సభ్యులతో వీక్షించారు.

11/18/2016 - 00:55

హైదరాబాద్, నవంబర్ 17: బ్యాంకుకు వెళ్లాలంటే మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్, ఆరోగ్య సమస్యలుంటే వాటికి సంబంధించిన మాత్రలు తీసుకుని వెళ్లాల్సిందే అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులను బ్యాంకులు నిజం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులు తలుపులు తీయకముందే క్యూలు సిద్ధమవుతున్నాయి.

11/17/2016 - 08:36

హైదరాబాద్, నవంబర్ 16: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం వారం రోజులుగా ఆర్‌బిఐ వద్ద భారీ క్యూ కొనసాగుతోంది. నోట్ల మార్పిడి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొత్త నోట్లు తీసుకున్నా.. చిల్లర బాధలు తప్పడం లేదు. ఆసుపత్రుల్లో, మెడికల్ షాపుల్లో పాత నోట్లు, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరుపుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆసుపత్రులు, మెడికల్ షాపుల యజమానులు వాటిని తిరస్కరిస్తున్నారు.

11/17/2016 - 08:35

హైదరాబాద్, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దుతో వాణిజ్య, వ్యాపార రంగాలే కాకుండా కూరగాయల మార్కెట్లూ కుదేలయ్యాయి. మరోవైపు రియాల్టీ రంగంపై వంద శాతం ప్రభావం పడింది. కొనుగోలుదారులు ఎవరూ అటువైపు కనె్నత్తి చూసే పరిస్థితి లేదు. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ల రిజిస్ట్రేషనే్ల తప్ప కొత్తగా క్రయ, విక్రయాలు దాదాపు పూర్తిగా నిలిచి పోయాయి.

11/17/2016 - 08:26

విజయవాడ, నవంబర్ 16: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లోని లోపాల ఆసరాతో రద్దయిన కరెన్సీ నోట్లను యథ్ఛేచ్ఛగా మారుకుంటున్న నల్ల కుబేరులకు ఇంకు చుక్కతో చెక్ పెట్టే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిబంధనల మేరకు నోట్ల మార్పడికి అదీ బ్యాంక్ ఖాతాలు లేనివారి కోసం ఐదు రకాల గుర్తింపు కాపీలను అందజేస్తే నాలుగు వేల రూపాయల వరకు నోట్లను మార్చుకునే వీలుంది.

11/16/2016 - 03:51

హైదరాబాద్, నవంబర్ 15: దేశ వ్యాప్తంగా విద్యార్థుల డేటాబేస్ నిర్వహించేందుకు జాతీయ స్థాయిలో నేషనల్ అకడమిక్ డిపాజిటరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ప్లస్ టు స్థాయి నుండి ఉన్నత విద్య అభ్యసించే ప్రతి ఒక్కరి వివరాలు ఈ నేషనల్ అకడమిక్ డిపాజిటరీలో అందుబాటులో ఉంటాయి.

11/16/2016 - 03:50

హైదరాబాద్, నవంబర్ 15: ఓటుకు నోటు కేసులో తమ వాదనలు వినకుండా తదుపరి దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో తప్పులున్నాయని మంగళవారం ఏసిబి హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానానికి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని ఏసిబి తెలిపింది. ఈ కేసును జస్టిస్ సునీల్ చౌదరి విచారించారు.

11/16/2016 - 03:49

హైదరాబాద్, నవంబర్ 15: రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పిజి కోర్సుల పరీక్షల షెడ్యూలును ప్రకటించింది. మొదటి సంవత్సరం ఎంఎ, ఎంఎస్సీ, ఎంకాం పరీక్షలు జనవరి 17 నుండి సెకండియర్ పిజి పరీక్షలు జనవరి ఆరు నుండి జరగుతాయి. ఎంబిఎ రెండో సంవత్సరం జనవరి ఆరు నుండి, మూడో సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుండి, మొదటి సంవత్సరం పరీక్షలు జనవరి 17 నుండి జరుగుతాయి.

11/16/2016 - 03:46

హైదరాబాద్, నవంబర్ 15: ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే బోగీల ఆధునికీకరణకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. మంగళవారం సికిందరాబాద్ జోన్ పరిధిలోని లాలాగూడ వర్క్‌షాపును ఆయన తనిఖీ చేశారు. వర్కుషాపునకు అధునాతన సాంకేతికతను సమకూర్చుకోవాలని, రైలు బోగీల నిర్వహణకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

11/16/2016 - 04:19

విజయవాడ, నవంబర్ 15: సాహితీ వేత్త, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు తెలుగు భాషాద్యమ ప్రముఖులు డా జివి పూర్ణచంద్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం సముచిత గౌరవం ఇచ్చింది. టిటిడి ప్రధాన సంపాదక కార్యాలయం ఆస్థాన పండిత పరిషత్ మండలిలోను సభ్యునిగా ఆయనను నియమించారు. నాలుగు దశాబ్దాలుగా చేసిన నిరంతర సాహితీ తపస్సుకు ఇది భగవంతుని వరంగా తాను భావిస్తున్నట్టు డా పూర్ణచందు తెలిపారు. 1975 నుండి 104 పుస్తకాలు వెలువరించారు.

Pages