S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/14/2016 - 01:57

హైదరాబాద్, నవంబర్ 13: ‘తెలంగాణలో అత్యంత బలహీనమైన ప్రభుత్వం ఉంది..’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు విమర్శించారు. ప్రతిపక్షాలు ఇంకా ప్రత్యక్ష రాజకీయ పరీక్షలకు దిగలేదని అన్నారు. ‘్భవిష్యత్తులో ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై ‘్భరత్-నితి’ సంస్థ ఆదివారం ఇక్కడ నిర్వహించిన చర్చా గోష్టికి మురళీధర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

11/14/2016 - 01:54

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మూడు, నాలుగు పేపర్ల పరీక్షలు ప్రశాంతంగా పూర్తయింది. మొత్తం 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 6.93 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4.98 లక్షల మంది అభ్యర్థులు ఆదివారం జరిగిన పరీక్షలకు హాజరయ్యారు.

11/14/2016 - 01:52

హైదరాబాద్, నవంబర్ 13: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నకిలీ నోట్ల చలామణి చర్చకు వస్తోంది. గత కొనే్నళ్లుగా దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి సరఫరా అవుతున్న నకిలీ కరెన్సీ చలామణి అవుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కోల్‌కతా కేంద్రంగా ఈ దందా కొనసాగుతుండడం, పోలీసులు పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

11/14/2016 - 01:51

హైదరాబాద్, నవంబర్ 13: దేశంలో అడవులు, వన్యప్రాణి సంరక్షణ కోసం కేంద్రం వచ్చే 14 సంవత్సరాలకు ఒక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. దేశంలో అడవుల్లో రక్షిత ప్రాంతాల సంఖ్యను పెంచేందుకు, అడవుల్లో వన సంపద, వన్యప్రాణులు స్మగ్లర్ల బారిన పడకుండా చేసేందుకు సమగ్ర ప్రణాళికను ఆధునిక టెక్నాలజీతో రూపొందించాలని కేంద్ర అడవుల శాఖ నిర్ణయించింది. దీనికి అన్ని రాష్ట్రప్రభుత్వాలు సహకరించాలని లేఖలు రాసింది.

11/14/2016 - 01:48

పలాస, నవంబర్ 13: అంతర్జాతీయ వేద విశ్వవిద్యాలయాన్ని నిర్మించేందుకు త్రిదండి చిన్నజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌నాయుడు ఆదివారం వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ భూమిపూజ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని కొత్తపేట గ్రామం వద్ద గల తర్లికొండపై 300 కోట్ల రూపాయలతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించనున్నారు.

11/14/2016 - 01:46

హైదరాబాద్, నవంబర్ 13: సమాజంలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ చార్టెడ్ అకౌంటెంట్ (సిఎ) ఫోరంను హైదరాబాద్ (సనత్‌నగర్)లో ఆదివారం ఆయన ప్రారంభించారు. పన్ను మదింపు విషయంలో దేశం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, సోయి లేకుండా మనం జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

11/14/2016 - 01:44

భద్రాచలం, నవంబర్ 13: ఆంధ్రా-ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లోని మావోయిస్టు ఏఓబి కమిటీ కార్యదర్శిగా కాకరాల పద్మను నియమించినట్లుగా సమాచారం. ఇటీవలే గత నెల 24వ తేదీన ఏఓబిలోని జంత్రిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కార్యదర్శి బాకూరి వెంకటరమణ మరణించిన సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తిరిగి ఏఓబిలో పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

11/14/2016 - 01:43

కర్నూలు, నవంబర్ 13: కర్నూలు జిల్లాలో నల్లకుబేరులు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త రూ. 2000 నోటు ఇస్తే రూ. 2,500(పాతవి ఐదు రూ. 500నోట్లు) ఇస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో సామాన్యులు తమవద్ద ఉన్న ఆయా నోట్లను తీసుకెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చొని మార్పిడి చేసుకున్నారు. అయితే బ్యాంకర్లు రూ.

11/14/2016 - 01:33

హైదరాబాద్, నవంబర్ 13: రాష్ట్రంలో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల రూ.2740 కోట్లమైన నష్టం వాటిల్లిందని, దీనికి కేంద్రం సహాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

11/14/2016 - 01:22

హైదరాబాద్, నవంబర్ 13: పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తల్లకిందులైతే సంక్షేమానికి కోత తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైన అన్నింటిపైనా నోట్ల రద్దు ప్రభావం కనిపిస్తోందని, ఇదే కొనసాగితే సంక్షేమ పథకాల భారాన్ని ప్రభుత్వం భరించటం కష్టమని కూడా అంటున్నారు.

Pages