S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/16/2016 - 02:32

భద్రాచలం, నవంబర్ 15: వివాదాలకు కేంద్ర బిందువైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 2017 జనవరిలో శ్రీ సీతారామచంద్రస్వామికి నిర్వహించే ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వారదర్శనం తేదీ విషయంలో పెద్ద చిక్కు వచ్చిపడింది. ముందుగా వైదిక కమిటీ 2017 జనవరి 8న ముక్కోటి ఏకాదశి, జనవరి 7న రాత్రి గోదావరిలో శ్రీసీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం నిర్వహిస్తామని షెడ్యూల్‌ను విడుదల చేసింది.

11/16/2016 - 02:26

హైదరాబాద్, నవంబర్ 15: పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఖజానాపై ఎలా ఉండబోతుంది? ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న శాఖల భవిష్యత్ పరిస్థితి ఏమిటీ? ఉపద్రవం నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యయనం చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై శాఖలవారీగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు.

11/16/2016 - 02:25

హైదరాబాద్, నవంబర్ 15: కేంద్ర ప్రభుత్వం రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేసి వారం దాటుతున్న ప్రజల కష్టాల్లో మార్పులేదు. సోమవారం బ్యాంకులకు సెలవు కావటంతో మంగళవారం బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఎటిఎం సెంటర్లకు ప్రజలు ఎగబడ్డారు. మోదీ నిర్ణయం తీసుకుని వారం దాటుతుంది కనుక, నగదు మార్పిడి పరిస్థతిలో మార్పు ఉండొచ్చని ఆశించిన జనానికి నిరాశే ఎదురైంది.

11/16/2016 - 02:20

విజయవాడ, నవంబర్ 15: ఫైబర్‌నెట్‌కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో పది లక్షల కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్ (సెట్ టాప్) బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు చైనా కంపెనీలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో స్టేట్ ఫైబర్‌నెట్ వడ్డీతోపాటు, రుణ వాయిదాలను చెల్లించేలా ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

11/16/2016 - 02:00

ప్రత్తిపాడు, నవంబర్ 15: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో బుధవారం నుండి సత్యాగ్రహ పాదయాత్ర జరప తలపెట్టిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పోలీసులు మంగళవారం సాయంత్రం నుండి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ నెల 16 నుండి 21 వరకు తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం నుండి అంతర్వేది వరకు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తామని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే.

11/15/2016 - 08:59

ధర్మపురి, నవంబర్ 14: కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా, జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకున్న బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో సోమవారం రాత్రి దేవస్థానం పక్షాన నిర్వహించిన పంచ సహస్రాధిక దీపారాధన నేత్రపర్వంగా సాగింది.

11/15/2016 - 07:26

హైదరాబాద్, నవంబర్ 14: కేంద్రం వాదనలు విననిదే తాము నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైదరాబాద్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ ఎ శివశంకర్‌లతో కూడిన బెంచ్ ముందు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నారాయణ రెడ్డి ఈ కేసు ప్రస్తావన తీసుకువచ్చారు.

11/15/2016 - 07:24

హైదరాబాద్, నవంబర్ 14: రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్ర హోం శాఖ ఆధీనంలోని హిందీ సలహా మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ఈ మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తన్నారు. సహాయ మంత్రులు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు ఎంపిలు సభ్యులుగా ఈ మండలిలో ఉన్నారు.

11/14/2016 - 02:11

హైదరాబాద్/ కాచిగూడ, నవంబర్ 13: దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. భక్తి టివి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ముందుగా కీసరగుట్ట శ్రీ వేంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల వారిచే వేదపఠనం చేశారు.

11/14/2016 - 01:59

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్రంలో బ్యాంకుల వద్ద, తపాలా కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు దరిమిలా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులతో ఆదివారం తన నివాసం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు.

Pages