S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/28/2016 - 02:32

మిర్యాలగూడ, అక్టోబర్ 27: నాలుగో కాన్పు కూడా ఆడపిల్ల కావడం, తల్లి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోషణ భారమై పుట్టిన పాపను 20 వేల రూపాయలకు విక్రయించిన సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని జంగాలకాలనీలో గురువారం చోటుచేసుకుంది. కల్లెం సైదులు, భాగ్యమ్మలకు ఇదివరకే ముగ్గురు ఆడపిల్లలు స్వప్న, సరిత, సరోజ ఉన్నారు. భాగ్యమ్మకు 15 రోజుల క్రితం నాల్గవ కాన్పులో మరో ఆడశిశువు జన్మించింది.

10/28/2016 - 02:30

అమరావతి, అక్టోబర్ 27: ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి పేరిట విడుదలయిన లేఖ నకిలీదేనన్న అనుమానం పెరుగుతోంది. మావోయిస్టు పార్టీ సానుభూతి సంస్థగా పేరున్న ఏపిసిఎల్‌సి నేత కల్యాణరావు వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆ లేఖ మావోలది కాదని నిర్ధారణ అయిన క్రమంలో, అన్ని వర్గాల చూపులు రాజకీయ కోణం వైపు మళ్లుతున్నాయి.

10/28/2016 - 02:29

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను విచారణకు హైకోర్టు గురువారం స్వీకరించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం భవనాలను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం హేతుబద్ధం కాదని పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు.

10/28/2016 - 02:28

హైదరాబాద్, అక్టోబర్ 27: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన 24 ఎకరాల భూమిపై కనే్నసింది. పంజాగుట్ట చౌరాస్తా నుండి అమీర్‌పేటకు వెళ్లే దారిలో ఉన్న నిజామియా అబ్జర్వేటరీ ఉస్మానియా యూనివర్శిటీకి చెందిందే.

10/28/2016 - 02:23

అమరావతి, అక్టోబర్ 27: హైదరాబాద్ సచివాలయంలోని ఏపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించే అంశంలో విమర్శలు తలెత్తకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంలో రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాల నుంచి సెంటిమెంటుపరమైన భావన రాకుండా ఆచితూచి అడుగులు వేయనుంది.

10/28/2016 - 02:22

హైదరాబాద్, అక్టోబర్ 27: సులభంగా వ్యాపారం, వాణిజ్యం చేసుకునేందుకు తేలికగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేరాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం రానుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సులభంగా వ్యాపారం, వాణిజ్యం చేసుకునేందుకు ఉన్న పరిస్థితులపై ప్రపంచబ్యాంకు తమ గ్రేడింగ్‌లతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది.

10/28/2016 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 27: అక్షయ గోల్డ్ నుంచి స్వాధీనం చేసుకున్న పది కోట్ల రూపాయల సొమ్మును డిపాజిటర్లకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపి ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిపాజిటర్లకు వారి సొమ్ము చెల్లించేందుకు రూ. 135 కోట్లు అవసరమన్నారు.

10/28/2016 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 27: మెడికల్, డెంటల్ కాలేజీల్లో యుజి కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)లో ప్రశ్నాపత్రాలను కనీసం ఆరు ప్రాంతీయ భాషల్లోనూ ఇవ్వాలని సిబిఎస్‌ఇ యోచిస్తోంది. ఇంత వరకూ నీట్ పరీక్ష ఆంగ్లంలో మాత్రమే జరిగేది.

10/28/2016 - 02:20

విశాఖపట్నం, అక్టోబర్ 27: ఏపికి తుపాను ముప్పు తప్పింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ పూర్తిగా బలహీనపడింది. ఇది గురువారం వాయుగుండగా మారి, విశాఖకు 240 కిలో మీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా, మచిలీపట్నంకు సమాంతరంగా కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది.

10/28/2016 - 02:19

హైదరాబాద్, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం ఢిల్లీలో కేటాయించిన బంగ్లా మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.82 కోట్లను గురువారం మంజూరు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి జీవో 2209ను జారీ చేశారు.

Pages