S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/01/2016 - 03:21

హైదరాబాద్, అక్టోబర్ 31: ‘సామాన్యుడైనా, మావోయిస్టు అయినా ప్రాణాలు విలువైనవి, ప్రజలను, వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

10/30/2016 - 04:16

పాఠకులకు, ప్రకటనకర్తలకు దీపావళి శుభాకాంక్షలు
- ఎడిటర్

పండుగ సందర్భంగా ఆదివారం
మా కార్యాలయానికి సెలవు. సోమవారం సంచిక వెలువడదు.

10/30/2016 - 03:02

హైదరాబాద్, అక్టోబర్ 29: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం-కొల్లం మధ్య 32 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

10/30/2016 - 02:59

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్‌లో నివాస గృహాల రియల్టీ రంగం జోరందుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే, రెండవ త్రైమాసికంలో అపార్టుమెంట్ల విలువ పెరిగింది.

10/30/2016 - 02:58

సదాశివపేట, అక్టోబర్ 29: పొట్టనింపుతూ జీవితాంతం పోషిస్తాడని నమ్మి ప్రేమించి కులాంతర వివాహమాడిన నిండు గర్భిణి భర్త నయవంచన, అత్త వేధింపులకులోనై అర్ధంతరంగా తనువు చాలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ పట్టణంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గిరిజాల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

10/30/2016 - 02:25

హైదరాబాద్, అక్టోబర్ 29: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ట్రిబ్యుల్ తేల్చి చెప్పగా, నాలుగు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ జరగాలని తెలంగాణ కోరుకుంటోంది.

10/30/2016 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 29: సుప్రీం కోర్టు, హైకోర్టుతో పాటు దేశంలోని అన్ని న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులను వెంటనే భర్తీ చేయని పక్షంలో ప్రజలకు న్యాయ వ్యవస్థంటే నమ్మకం సడలుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ సంతోష్ హెగ్డే అన్నారు.

10/30/2016 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 29: దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

10/30/2016 - 02:22

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాకరంగా నిర్మించనున్న కొత్త సచివాలయం నిర్మాణానికి ఏపి ప్రభుత్వం సహకరిస్తుందా? తెలంగాణ అడిగిన ఏపి సచివాలయం భవనాలను ఇస్తుందా? ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 31వ తేదీన ఆంధ్ర మంత్రివర్గసమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపి ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఏపి సచివాలయం భవనాలను తెలంగాణకు ఇచ్చే విషయమై కీలక నిర్ణయం తీసుకోనుంది.

10/30/2016 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 29: ఎస్‌ఎస్‌సి రెగ్యులర్/ ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షా ఫీజును చెల్లించే గడువును పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల బోర్డు డైరెక్టర్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఆలస్య రుసుము లేకుండా 2016 నవంబర్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చని, 50 రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ 23 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

Pages