S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/29/2016 - 05:24

హైదరాబాద్, అక్టోబర్ 28: దేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది పొగాకు రైతుల సంక్షేమాన్ని, జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్వహించే సదస్సును బహిష్కరించాలని అఖిల భారత పొగాకు రైతు సంఘాల సమాఖ్య కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ సదస్సులో పొగాకు నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

10/29/2016 - 05:24

హైదరాబాద్, అక్టోబర్ 28: అమెరికాలో జన్మించిన ఇద్దరు పిల్లలు భారత్‌లో తన తల్లితో కలిసి ఉండేందుకు అనుమతిని ఇస్తూ అమెరికా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో స్ధిరపడిన ప్రవాస భారతీయుడు ఈ పిటిషన్‌దాఖలు చేశారు.

10/29/2016 - 05:23

హైదరాబాద్, అక్టోబర్ 28: ఓటుకునోటు కేసు కొత్త మలుపు తిరిగింది. తనపై ఏసిబి కోర్టు తాజా దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ కేసులో తన వాదనలు వినిపించేందుకు అనుమతించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టును కోరారు.

10/29/2016 - 05:20

హైదరాబాద్, అక్టోబర్ 28: ఓ వైపు భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పులు, దేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాల హెచ్చరికలు, మరోవైపు ఏవోబిలో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా నగరంలో ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈనెల 30 నుంచి నవంబర్ 5వరకు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.

10/29/2016 - 05:18

హైదరాబాద్, అక్టోబర్ 28: రెండు రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించే యుజి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ పరీక్షలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 16 వరకూ జరుగుతాయి. తృతీయ సంవత్సరం పరీక్షలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 3 వరకూ, సెకండియర్ పరీక్షలు డిసెంబర్ 5 నుండి 10వ తేదీ వరకూ, ఫస్టియర్ పరీక్షలు డిసెంబర్ 13 నుండి 16 వరకూ జరుగుతాయని యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

10/29/2016 - 04:06

హైదరాబాద్, అక్టోబర్ 28: సమాజానికి శాపంలా పరిణమిస్తోన్న ఉగ్రవాదం సైబర్ టెక్నాలజీతో కొత్తరూపం దాల్చిందని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడంలో రాజీ పడొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు.

10/28/2016 - 04:06

భద్రాచలం, అక్టోబర్ 27: మావోయిస్టుల్లో అంతర్మథనం చోటు చేసుకుందా.. అంబుజ్‌మడ్ ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగంగా ఏడాది పూర్తికాకుండానే ఇప్పటి వరకు 110 మంది సాయుధ మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇప్పటి వరకు రెండు సార్లు కెకెడబ్ల్యు కమిటీని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో చంపేశాయి. అటు వైపు ఏఓబిలోనైనా పార్టీ పటిష్టంగా ఉందా?

10/28/2016 - 03:50

ఒంగోలు/ టంగుటూరు, అక్టోబర్ 27: మావోయిస్టు పార్టీ కీలక నేత అక్కిరాజు రామకృష్ణ తనయుడు పృథ్వి అలియాస్ మున్నా మృతదేహానికి గురువారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మున్నా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుండి బంధువులు గురువారం ఉదయం ఆలకూరపాడుకు తీసుకువచ్చారు.

10/28/2016 - 03:41

కర్నూలు, అక్టోబర్ 27: తాను మరణించినా మరో ఐదుగురికి ప్రాణం పోసి వారిలో జీవిస్తున్నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన పుల్లయ్య. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్సపొందిన కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన బోయ పుల్లయ్య(34) గురువారం తెల్లవారుజామున బ్రెయిన్‌డెడ్‌కు గురవడంతో అతని అవయవాలను మరో ఐదుగురికి అమర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

10/28/2016 - 02:33

హైదరాబాద్, అక్టోబర్ 27: ఓటుకు నోటు కేసులో తాజాగా దర్యాప్తు చేపట్టాలంటూ ఏసిబి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది.

Pages