S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/30/2016 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 29: రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి పోలీస్ అకాడమి అదనపు డైరెక్టర్, 1997వ బ్యాచ్‌కు చెందిన ఎంకె సింగ్ బదిలీ అయ్యారు. అతడిని తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజిపిగా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

10/30/2016 - 02:20

హైదరాబాద్, అక్టోబర్ 29: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ దీపావళి పండుగు సందర్భంగా కార్మికులకు కానుక ప్రకటించారు. భవిష్యనిధి (పిఎఫ్)లో వాడుకలో లేకుండా ఉన్న 42 వేల కోట్ల రూపాయలపై 8.8 శాతం వడ్డీని కార్మికులకు చెల్లించేలా నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు దత్తాత్రేయ శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. దీని వలన 9.8 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

10/30/2016 - 02:19

విజయవాడ, అక్టోబర్ 29: నవ్యాంధ్రలోని దేవాలయాలకు ప్రత్యేక శోభను సంతరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 1371 దేవాలయాలకు ఏటా రూ.8కోట్ల మేర సాయం చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఆలయాలకు చెల్లింపులు చేసేందుకు, దేవాలయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని దేవాలయాలకు జవజీవాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

10/30/2016 - 02:19

భద్రాచలం, అక్టోబర్ 29: ఏఓబిని భద్రతా బలగాలు దిగ్బంధం చేశాయి. ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాలు బలిమెలకు భారీగా బలగాలను తరలించాయి. కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో ఎదురుదాడులు చేసే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

10/30/2016 - 01:54

రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి దారుణ హత్యకు గురయ్యాడు. అగంతకులు దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి చంపినట్టు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వై శివ వెంకటేష్ (20) రాజమహేంద్రవరం సమీపంలోని రైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇసిఇ బ్రాంచిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

10/30/2016 - 01:51

హైదరాబాద్, అక్టోబర్ 29: కృష్ణా జలాల కేటాయింపు వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.

10/30/2016 - 01:49

మార్తి సుబ్రహ్మణ్యం

10/29/2016 - 06:39

హైదరాబాద్, అక్టోబర్ 28: ఎస్‌సి, ఎస్‌టిలకు చెందాల్సిన సబ్-ప్లాన్ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని ఎపి కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్. తులసిరెడ్డి విమర్శించారు. అయినా చంద్రన్న దళిత, గిరిజన బాట పేరిట బస్తీల్లోని అమాయక పేద ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

10/29/2016 - 05:27

హైదరాబాద్, అక్టోబర్ 28: అనువాదాలు మానవాళిని దగ్గర చేస్తాయని రష్యా రాజధాని మాస్కోలో జరిగిన హిందీ సమ్మేళనంలో కేంద్ర హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. దేశాల అగ్రనాయకుల చర్చలలో దుబాసీల ప్రాముఖ్యత ఉన్నట్టే, సాహిత్య అనువాదాల వల్ల జాతులు, దేశాలు, వాటి సంస్కృతుల మధ్య పరస్పరం అవగాహన పెరగడానికి తద్వారా ప్రపంచ మానవాళి దగ్గర కావడానికి అవకాశం ఏర్పడుతందని ఆయన పేర్కొన్నారు.

10/29/2016 - 05:26

విశాఖపట్నం, అక్టోబర్ 28: పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా అందించే సేవల్లో పోస్ట్ఫాసులు భాగస్వామ్యం కానున్నాయి. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనివల్ల పాస్‌పోర్టు కార్యాలయాల్లో సిబ్బంది కొరతను అధిగమించవచ్చని భావిస్తోంది. మరోపక్క పోస్ట్ఫాసుల్లో సిబ్బందికి చేతినిండా పనికల్పించినట్టు అవుతుంది. దీనివల్ల ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థలకు పాస్‌పోర్టు సేవలు నిర్వహించాల్సిన పని ఉండదు.

Pages