S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/06/2016 - 07:41

హైదరాబాద్: చాలరోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయానికి వచ్చారు. ఇంటి వద్దనే పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నేరుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో ముచ్చటించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహం ముందు నివాళులర్పించారు.

03/06/2016 - 05:29

రాజమహేంద్రవరం: భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి-బిజెపి సంకల్పం నినాదంతో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు బిజెపి భారీ ఏర్పాట్లు చేసింది.

03/06/2016 - 05:17

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు ఎన్టీఆర్ ఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. అప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చారు. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్ళారు.

03/06/2016 - 04:42

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్ కొడుకు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు నిర్భయ కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు శనివారం మంత్రి రావెల క్వార్టర్స్‌కు వెళ్లి నోటీసులు అందించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41ఏ కింద ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శుక్రవారం ఓ ఉపాధ్యాయురాలి పట్ల మంత్రి కొడుకు సుశీల్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం విదితమే.

03/06/2016 - 03:28

హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంకు కేసు విచారణకు సంబంధించి సుజన యూనివర్శల్ ఇండస్ట్రీస్‌కు చెందిన బోర్డు డైరెక్టర్లు ఈనెల 22న కోర్టు ఎదుట హాజరు కావాలని శనివారం ఇక్కడ 11వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

03/05/2016 - 07:13

హైదరాబాద్: ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఉప రాష్టప్రతి శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు.

03/04/2016 - 08:44

హైదరాబాద్, మార్చి 3: దేశంలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని, రైతుల ఆత్మహత్యలను తాత్కాలిక ఉపశమన చర్యల ద్వారా నిరోధించలేమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన అఖిల భారత రైతు సంఘం (ఏఐకెఎస్) 29వ జాతీయ మహాసభలను ప్రారంభించారు.

03/04/2016 - 08:42

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 5వ తేదీ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సీనియర్ పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు, అసెంబ్లీ సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 18 రోజుల పాటు శాసనసభ జరుగుతుందని ప్రకటించారు.

03/04/2016 - 06:46

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కొత్త రిక్రూట్‌మెంట్లకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రధానంగా తొలుత గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయాలని తర్వాత గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే జూన్ నాటికి ఉన్న ఖాళీల స్థితిని నవీకరించి తర్వాత నోటిఫికేషన్లు జారీకి వీలుగా సన్నద్ధమవుతోంది.

03/04/2016 - 06:40

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వాయర్లు, డ్యాంలు, బ్యారేజీలు, నదులు, కాల్వల నుంచి పూడికను తీసేందుకు కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు చేపట్టిన టెండర్ ప్రక్రియ కేటాయింపులను నిలుపుదల చేస్తూ చెన్నైలోని సదరన్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Pages