S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/12/2018 - 04:58

దేవీపట్నం/పోలవరం, మే 11: పాపికొండలు విహార యాత్ర 120మంది పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడింది. వారు ప్రయాణిస్తున్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడమే అందుకు కారణం. బోటు బయలుదేరిన కొన్ని నిమిషాలకే మంటలు చెలరేగడం, డ్రైవరు సమయస్ఫూర్తితో ఇసుక తినె్నల చేరువలోకి బోటును నడిపించడంతో అదృష్టవశాత్తు ప్రయాణీకులంతా సురక్షితంగా తప్పించుకున్నారు. అనంతరం బోటు పూర్తిగా దగ్ధమైంది.

05/11/2018 - 18:08

హైదరాబాద్: విభజన అంశాల అమలుకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం శుక్రవారంనాడు జరిగింది. బేగంపేట్ మెట్రోరైలు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

05/11/2018 - 16:45

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని శిరీష కేసు వివరాలను శంషాబాద్‌ డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే కోపంతోనే సాయిప్రసాద్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రెస్‌మీట్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

05/11/2018 - 16:40

విశాఖపట్నం: టీడీపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, వాళ్లను జైల్లో పెట్టించాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు కావాలనే చేశారో లేదా సీఎం ఆదేశాల మేరకు చేశారో తెలాల్సి ఉందని అన్నారు. దాడికి పాల్పడిన కార్యకర్తలను జైల్లో పెట్టించాలిన అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలువదని జోస్యం చెప్పారు.

05/11/2018 - 13:50

కరీంనగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచార ఆర్భాటంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని తిట్టడానికే ‘రైతుబంధు’ కార్యక్రమం పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా సెంటిమెంట్‌గా భావించే కేసీఆర్‌, జిల్లాకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

05/11/2018 - 13:41

కర్నూలు: జిల్లా డోన్‌లో ప్రైవేట్‌ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను హత్య చేసి ఉడుములపాడు సమీపంలోని స్టేడియం పక్కన పడేశారు. మృతుడు శ్రీకాంత్‌రెడ్డి ప్రముఖ వైద్యుడు ప్రభాకర్‌రెడ్డి కుమారుడు.

05/11/2018 - 13:28

విశాఖ : ఒడిషా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాపై పడనుంది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఓ ప్రకటనలో పేర్కొంది.

05/11/2018 - 13:11

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారంనాడు స్వామివారి దర్శనం చేసుకుని వెళుతుండగా కొందరు టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

05/11/2018 - 13:07

దేవీపట్నం: పాపికొండల యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోశమ్మ గుడి నుంచి బయలుదేరిన కొద్ది సమయం వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఈదుకుంటూ వచ్చి ప్రయాణీకులను రక్షించారు. పడవలో 80మంది ప్రయణీకులు ఉన్నారు. వీరిలో కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు.

05/11/2018 - 05:38

కరీంనగర్, మే 10: ‘భరతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయం, రాష్ట్రంలోని 58 లక్షలమంది రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు అందిస్తున్నాం. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కింది. దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలువనుంది’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

Pages