S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/11/2018 - 03:23

బాదామి, మే 10: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు గురువారం బాదామి నుంచి షా రోడ్‌షో ప్రారంభించారు. షా రాక సందర్భంగా నియోజకవర్గమంతా బీజేపీ బ్యానర్లు, జెండాలతో నింపేశారు. ఉత్తర కర్నాటకలోని బాదామి నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు.

05/11/2018 - 05:05

తిరుపతి, మే 10: తిరుమలలో గురువారం హనుమజ్జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం చేపట్టారు. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఈ అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న శ్రీబేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు.

05/11/2018 - 03:20

సియాచిన్, మే 10: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సైనికులను కృతజ్ఞతలు తెలిపారు. గత 34 సంవత్సరాలుగా ధైర్యసాహసాలకు పేరుపడిన మన సైనికులు ఇక్కడ విధులు నిర్వర్తించడం వల్ల, దేశ ప్రజలకు మన సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్న విశ్వాసం ఏర్పడుతోందన్నారు.

05/11/2018 - 05:07

విజయవాడ, మే 10: విజయవాడ నగరంలో అంతర్భాగమైన కానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ ఆటోనగర్‌లో ఓ కూలర్ల తయారీ కంపెనీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.

05/11/2018 - 02:56

కర్నూలు సిటీ, మే 10: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక నగరంగా ప్రత్యేకత సంతరించుకుని స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

05/11/2018 - 02:42

* రైతుబంధు పథకంతో 58 లక్షల మందికి లబ్ధి రూ.6వేల కోట్లు బ్యాంకుల్లో ఉంచాం

05/11/2018 - 05:08

హైదరాబాద్, మే 10: సముద్రం ఒకరి కాళ్ల దగ్గరకి వచ్చి గర్జించదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆవేశంగా మాట్లాడిన పవన్ పవన్ పర్వతం ఎవరికీ ఒంగి సలాం చేయదన్నారు. ‘మనమంతా కలిసి పిడికెడు మట్టే కావచ్చు.

05/11/2018 - 02:35

హైదరాబాద్, మే 10: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కీలక భేటీ శుక్రవారం హైదరాబాద్‌లో జరుగనుంది. బేగంపేట మెట్రోరైలు భవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖల అధికారులు కూడా హాజరవుతున్నట్టు అధికార వర్గాల సమాచారం.

05/11/2018 - 05:10

హైదరాబాద్, మే 10: తెలంగాణలోని రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా మోసం చేస్తున్నారని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని దుయ్యబట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా రైతు కుటుంబాలను బాగుచేస్తామని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

05/11/2018 - 05:11

హైదరాబాద్, మే 10: ప్రచారాలతో హోరెత్తించి వినియోగదారులను ఆకర్షించే బడా వ్యాపార సంస్థల లోగుట్టు బట్టబయలైంది. హైదరాబాద్‌లో తూనికలు కొతల శాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బడా షాపింగ్ మాల్స్‌లో జరుగుతున్న అక్రమాలు బట్టబయలు అయ్యాయి. తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు గురువారం నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో పేరున్న షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేపట్టాయి.

Pages