S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/11/2018 - 02:19

బెంగళూరు, మే 10: ‘ఈ దేశంలో చాలామంది భారతీయుల కంటే మా అమ్మ లోనే భారతీయత ఎక్కువ’ అని రాహుల్ గాంధీ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ఇటీవల సోనియాగాంధీ విదేశీ మూలాల గురించి ప్రస్తావించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ- ‘మా అమ్మ పుట్టుకతో ఇటలీ దేశస్తురాలు కావచ్చు. కాని ఈ దేశంకోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. జీవితంలో ఎక్కువ భాగం ఈ దేశంలోనే నివసించారు. ఇక్కడి ప్రజలు, సంస్కృతితో మమేకమయ్యారు.

05/10/2018 - 17:13

నల్లగొండ:పకడ్బందీగా పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసినట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం యాడ్గార్‌పల్లిలో ఆయన రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కోసం నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

05/10/2018 - 16:49

కర్నూలు:జిల్లాలోని నంద్యాల మండలం మూలసాగరంలోని ఆలయ ఈఓ వీరయ్య ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారంనాడు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పదికోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

05/10/2018 - 16:48

కర్నూలు: ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తయారుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో విద్యార్థులు, మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.

05/10/2018 - 16:47

కరీంనగర్: కరీంనగర్‌లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించటానికి వెళుతున్న సీఏం కేసీఆర్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన ఎదురైంది. శంకరపట్నం తడికల్ గ్రామం మీదుగా వెళుతుంటే అక్కడ ఓ వివాహం జరుగుతుంది. వెంటనే కేసీఆర్ తన వాహనాన్ని ఆపించి ఆ వివాహవేడుక వద్దకు వెళ్లి నూతన వధువరులను ఆశీర్వదించారు. మంత్రి ఈటెల కూడా వధువరులను ఆశీర్వదించారు.

05/10/2018 - 13:23

కరీంనగర్ : భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కిందన్నారు. తనకు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం, సెంటిమెంట్ ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతులకు పాస్ పుస్తకాలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

05/10/2018 - 13:22

విజయవాడ: విజయవాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని ప్లాస్టిక్ వస్తువుల తయారీ సంస్థలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం ప్రయత్నిస్తోంది. ప్లాస్టిక్‌ పైపులకు మంటలు అంటుకోవడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

05/10/2018 - 13:00

హైదరాబాద్: 'వెబ్రెన్ట్స్ ఆఫ్ కలామ్‌' సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ కళాభారతిలో అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. ఈ జాతీయ జెండాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దేశ సమగ్రత కాపాడాలని యువతతో పవన్‌కల్యాణ్‌ ప్రతిజ్ఞ చేయించారు.

05/10/2018 - 12:55

కృష్ణా: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెంకట కృష్ణప్రసాద్ గురువారం వైకాపాలో చేరారు. కృష్ణప్రసాద్ స్వగ్రామమైన నందిగామ మండలం ఐతవరం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మండవల్లికి చేరుకున్న అనంతరం వైఎస్ జగన్‌ను కలిసి చేరారు.

05/10/2018 - 12:13

గుంటూరు: గుంటూరులో రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభమైంది. చంద్రమౌళి నగర్‌లోని పోస్టాపీసులో ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సభాపతి కోడెల శివప్రసాదరావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ రామకృష్ణ, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Pages