S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/26/2018 - 02:02

అమరావతి, జనవరి 25: ఆంధ్ర ప్రదేశ్‌కు సహకరించేందుకు ఆలీబాబా క్లౌడ్ సంస్థ ముందుకొచ్చింది. భారత్‌లో శుక్రవారం తొలి డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రెండో కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ సిఈఓ సైమన్ హూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

01/26/2018 - 01:29

హైదరాబాద్, జనవరి 25: ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్‌వర్మ తాజాగా తీసిన ‘గాడ్, సెక్స్, ట్రూత్ -జిఎస్‌టి’ లఘు చిత్రంపై తీవ్ర దుమారం చెలరేగింది. పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో తీసిన ఈ చిత్రం మహిళలను కించపర్చేవిధంగా ఉందని విమర్శలు వచ్చాయి. శుక్రవారం ఆన్‌లైన్‌లో జిఎస్‌టి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నేపధ్యంలో సామాజిక కార్యకర్త దేవి, రామ్‌గోపాల్‌వర్మల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది.

01/26/2018 - 01:28

హైదరాబాద్, జనవరి 25: కోడిపందేల కేసుకు సంబంధించి హైకోర్టుకు ఈ నెల 29వ తేదీన హాజరుకాకుండా ఆంధ్ర డిజిపికి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కలిదిండి రామచంద్రరాజు అనే వ్యక్తి కోడిపందేలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం విచారించింది.

01/25/2018 - 00:15

అమరావతి, జనవరి 24: తన బావే కదా.. సీట్లో కూర్చుంటే ఏమవుతుందిలే అనుకున్నట్లున్నాడు నందమూరి బాలకృష్ణ. అందుకే ఎవరినీ అడక్కుండా ఎంచక్కా సీఎం సీట్లో కూర్చుని ముఖ్యమంత్రి మాదిరిగా సమీక్ష నిర్వహించేశారు. మామూలు ఎమ్మెల్యే సీఎం సీట్లో కూర్చోవడం, సమీక్ష నిర్వహించడం దుస్సాహసమే! కానీ, సీఎం చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాత్రం కాదు!

01/24/2018 - 23:28

తిరుపతి, జనవరి 24: సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

01/24/2018 - 03:54

చీకటినిజీల్చి వెలుగులుజిమ్మునతడు
విశ్వమును మేల్కొలిపెడి సన్మిత్రుడతడు
జవము జీవములనొసగి సాకునతడు
ఒక్క వందనమునకిచ్చు వందయేండ్లు

01/24/2018 - 03:22

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు చదువుల వత్తిడితో మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కేసులో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు నారాయణ, శ్రీచైతన్య కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావు విచారించారు.

01/24/2018 - 03:19

కరీంనగర్, జనవరి 23: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత, సినీ నటుడు కొణిదెల పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. భారతదేశంలో కులాలను విస్మరించి రాజకీయాలు చేయలేమని, అన్ని కులాలను గౌరవించాల్సిన అవసరముందని అన్నారు. ఆఖండ భారత్ విడిపోయినప్పుడు..

01/24/2018 - 02:53

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే, విద్యా ప్రమాణాలు దిగజారుతాయని హైకోర్టు పేర్కొంది. ఇన్విజలేటర్లు మాస్ కాపీయింగ్‌ను నిరోధించని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

01/24/2018 - 02:52

హైదరాబాద్, జనవరి 23: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ శాఖ ప్రతిష్టకు భంగం కలించినందుకు ఏసిబి అదనపు ఎస్పీ డి సునీత, కల్వకుర్తి ఇన్‌స్పెక్టర్ వై మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేస్తునట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఈ రకమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, శాఖకు మచ్చ తెచ్చే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటనలో హెచ్చరించారు.

Pages