S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/03/2017 - 01:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్వచ్ఛ్భారత్ లక్ష్యంలో భాగంగా చేపట్టిన స్వచ్ఛతా మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు లభించాయి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విజ్ఞాన్ భవన్‌లో ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/02/2017 - 23:06

హైదరాబాద్, అక్టోబర్ 2: శంషాబాద్ మండల కేంద్రంలో ఓ చిన్నారి కిడ్నాపైంది. కిడ్నాపై మూడు నాలుగు రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. మహేశ్వరం మండలం పడమటి తండాకు చెందిన జ్యోతి పేదరికం కారణంగా తన కుమార్తె షైనీని శంషాబాద్‌లోని సిద్దాంతి బస్తీలో నివాసముండే రాణి, సురేందర్ దంపతులకు దత్తత ఇచ్చింది. రాణికి మేకగూడకు చెంద హంస నెల రోజుల క్రితం పరిచయమైంది.

10/02/2017 - 03:52

అలంపూర్, అక్టోబర్ 1: అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబదేవి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చివరి రోజు శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లు హంసవాహన సేవలో విహరించారు. తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్లాదకరంగా స్వామి వార్లు ఆనందదాయకంగా తుంగభద్ర నదిలో సాయంకాలం హంసవాహనంలో భక్తులకు కన్నుల పండువగా అలరించారు.

10/02/2017 - 03:28

హైదరాబాద్, అక్టోబర్ 1: విజయ దశమి సందర్భంగా బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నిర్వహించిన ‘అలయ్- బలయ్’ ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే వివిధ వేషాధారులైన కళాకారుల నృత్యాలు చూపరులను ఆకర్షించాయి, డప్పువాయిద్యాలు హోరెత్తాయి.

10/02/2017 - 03:26

హైదరాబాద్, అక్టోబర్ 1: వెనుకబడిన వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడం వల్ల బిసిలంతా బాధపడ్డారని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు తెలిపారు. ‘అలయ్-బలయ్’లో విహెచ్ ప్రసంగిస్తూ బిసి నేతను మంత్రివర్గం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు.

10/02/2017 - 02:29

మహబూబాబాద్, అక్టోబర్ 1: మత సామరస్యానికి ప్రతీకగా జాతిమత సమైక్యత భావాన్ని దేశభక్తిని మననం చేసుకుంటూ అందుకు చిహ్నమైన విజయదశమి పర్వదినంనాడు మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రమైన గార్లలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా నిజాం నవాబు కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని నేటికీ అమలు చేస్తున్నారు.

10/02/2017 - 02:26

హైదరాబాద్, అక్టోబర్ 1: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే అనంత రెడ్డి మరణం పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

10/02/2017 - 02:25

హైదరాబాద్, అక్టోబర్ 1: వలస కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం సాగిద్దామని సిఐటియు పిలుపునిచ్చింది. తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా అనేక రంగాల్లో కనీస హక్కులకు నోచుకోవడం లేదని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు తెలిపారు. ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

10/02/2017 - 02:25

హైదరాబాద్, అక్టోబర్ 1: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. నరుూం అక్రమాస్తులు, స్థలాల కొనుగోళ్లు, ఆదాయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో నరుూం కూడబెట్టుకున్న ఆస్తులు, ఇళ్ల ఖరీదులపై కనే్నసిన ఐటీ శాఖ అధికారులు యాదాద్రి, భువనగిరి జిల్లా కేంద్రంలోని నరుూం ఇంటికి గత నెల 25న నోటీసులు అంటించారు.

10/02/2017 - 02:14

హైదరాబాద్, అక్టోబర్ 1: మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని పాతబస్తీలో ప్రతిష్ఠించిన బీబీకా ఆలం ఊరేగింపు కన్నుల పండువగా జరుగనుంది. సోమవారం షియా ముస్లింలు ఈ వేడుకను భక్తిప్రపత్తులతో నిర్వహించనున్నారు. వేలాది మంది యువకులు మాతం పాటిస్తూ బీబీకా ఆలం ఊరేగింపులో పాల్గొననున్నారు.

Pages