S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/25/2017 - 02:41

నిజామాబాద్, జూలై 24: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ రంగానికి ఈ నెల 25వ తేదీ నుండి ఉదయం వేళలోనే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు షిఫ్టు పద్ధతుల్లో విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం రైతుల భద్రత, వారి శ్రేయస్సు దృష్ట్యా ఉదయం వేళలోనే కరెంటు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

07/25/2017 - 02:37

సిద్దిపేట, జూలై 24 : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఎస్పీ, కమిషనరేట్ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి వెల్లడించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/25/2017 - 19:18

నల్లగొండ: సరైన వర్షాలు లేక కృష్ణానది ప్రాజెక్టులైన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీటి మట్టం పడిపోవడంతో హైద్రాబాద్-నల్లగొండల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇరిగేషన్, హైద్రాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌లు భగీరథ ప్రయత్నం ఆరంభించాయి.

07/25/2017 - 02:25

హైదరాబాద్, జూలై 24: అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావును సోమవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి స్వయంగా వెళ్లి కేశవరావును పరామర్శించడంతో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులను పిలిపించి ఆయన అరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

07/25/2017 - 02:21

హైదరాబాద్, జూలై 24: తెలంగాణ ప్రభుత్వం ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని , ముఖ్యమంత్రి మాటలతో గడిపేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్థపాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి హామీల గురించి రాస్తే రామాయణం, చెబితే భారతం అవుతుందని అన్నారు. ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారని కాని ఒక్కటీ అమలు కాలేదని అన్నారు.

07/25/2017 - 01:47

హైదరాబాద్, జూలై 24: పన్ను మదింపుపై పూర్తి స్థాయి నిఘా ఉందని, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ, ఆంధ్రా ఆదాయపు పన్ను శాఖ ముఖ్య ప్రధాన కమిషనర్ ఎస్‌పి చౌదరి అన్నారు. పన్నుల వసూళ్లు సాఫీగా జరగాలంటే పటిష్టమైన పరిపాలన విధానం ఉండాలని అన్నారు. సోమవారం నాడిక్కడ జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్లో ‘ఆదాయపు పన్ను ఉత్సవాలు, సదస్సు’లో చౌదరి కీలకోపన్యాసం చేశారు.

07/25/2017 - 01:45

సిద్దిపేట, జూలై 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజాకంటక పాలన సాగిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు, రైతాంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తు దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు జైలుభరో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.

07/25/2017 - 01:44

హైదరాబాద్, జూలై 24: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఒక్క రోజులో మంత్రి కాలేదని, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో అంకితభావంతో పని చేసి నాయకుడై, మంత్రి అయ్యాయరని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సోమవారం నాడిక్కడ తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ దిలీప్ కొణతం రచించిన ‘్ఫ్యచర్ ఫెర్‌ఫెక్ట్ కెటిఆర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

07/25/2017 - 01:41

హైదరాబాద్, జూలై 24: పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలు పారిశ్రామిక వాడల్లో హరిత హారంలో భాగంగా టిఎస్‌ఐఎస్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటి మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మల్లాపూర్ ఐడిఏ, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లో బాలమల్లు మొక్కలు నాటారు.

07/25/2017 - 01:41

హైదరాబాద్, జూలై 24: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య, అభివృద్ధి, శిక్షణ కేంద్రం (తెలంగాణ బిసి స్టడీ సర్కిల్) ఆధ్వర్యంలో కొన్ని వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Pages