S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/23/2017 - 03:18

ధర్మపురి, జూలై 22: నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సమన్యాయం ప్రాతిపదికన జరిగిన ఉద్యమ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక తొలి ప్రభుత్వాధినేత కేసిఆర్ పరిపాలన రజాకార్లను మరిపిస్తస్తోందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మూసపేట రామరాజు ఆరోపించారు.

07/23/2017 - 03:16

చిగురుమామిడి, జూలై 22: ఈఏడాది చివరికల్లా మిడ్‌మానేరు నుంచి సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు తోటపల్లి లింక్ కెనాల్ ద్వారా పంట, పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరాఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

07/23/2017 - 03:14

వరంగల్, జూలై 22: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేసింది. అవసరమైతే ఈ విషయంలో రాష్టవ్య్రాప్తంగా వచ్చే రెండునెలల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ నిర్ణయించింది.

07/23/2017 - 02:38

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌తో రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ పాటించని పరిశ్రమలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ బేగంపేట క్యాంప్ కార్యాలయంలో జరిగిన పరిశ్రమల శాఖ, టిఎస్‌ఐఐసి, కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

07/23/2017 - 02:36

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లోని కాసుబ్రహ్మానందరెడ్డి (కెబిఆర్) పార్కు చుట్టూ నిర్మించ తలపెట్టిన ‘వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు’ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు) కు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర అటవీ మంత్రి జోగురామన్న అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది.

07/23/2017 - 02:35

హైదరాబాద్, జూలై 22: మాదకద్రవ్యాల వ్యవహారంలో సిట్ అధికారులు సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తున్నారని దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో పేర్కొనడంపై దుమారం లేపింది. రాంగోపాల్ వర్మపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. పూరీ, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు రాంగోపాల్ వర్మ శిష్యులని, వారిని కాపాడుకునేందుకు వర్మ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సిట్ భావిస్తోంది.

07/23/2017 - 02:31

హైదరాబాద్, జూలై 22: డ్రగ్స్ మాఫియా దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని, ఈ విషయంలో దోషులెవరైనా వదిలి పెట్టమని ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు తెలిపారు. సినీ పరిశ్రమను ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారన్న అభియోగాల్లో వాస్తవం లేదని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలన్న ముఖ్యమంత్రి కె.

07/23/2017 - 02:29

హైదరాబాద్, జూలై 22: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. 12మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు అందజేసింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు అరెస్టయినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు.

07/23/2017 - 02:26

హైదరాబాద్, జూలై 22: కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చేందుకు, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సకాలంలో ప్రతిపాదనలు పంపేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించి వెంటనే అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పిసింగ్ ఆదేశించారు.

07/23/2017 - 02:24

హైదరాబాద్, జూలై 22: సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న మాదకద్రవ్యాల వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సినీ ప్రముఖుల విచారణ నాలుగవ రోజుకు చేరింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, నటుడు సుబ్బరాజును సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విచారణకు తరుణ్ తన తండ్రి చక్రపాణి, సన్నిహితులతో కలసి శనివారం ఉదయం గం. 10:00లకు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

Pages