S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/15/2016 - 07:06

హైదరాబాద్, డిసెంబర్ 14: ‘ప్రభుత్వం అంటే మంజూరీలు చేయడానికే పరిమితం కాదు. మంచి పథకాలు, విధానాలతో ప్రజా జీవితాల్లో మార్పు తేవడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలుచేసే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, పరిపాలనా విభాగాలను వికేంద్రీకరించామని అన్నారు.

12/14/2016 - 04:13

హైదరాబాద్, డిసెంబర్ 13: కొత్త నోట్ల పంపిణీలోనూ తెలంగాణకు కోత విధించారు. దేశ వ్యాప్తంగా కొత్త నోట్ల పంపిణీలో తెలంగాణకు దక్కాల్సిన వాటా కన్నా తక్కువ కరెన్సీ పంపించారు. తెలంగాణకు ఇప్పటి వరకు 17,500 కోట్ల రూపాయల కొత్త నోట్లను ఆర్‌బిఐ పంపించింది. వాస్తవానికి తెలంగాణకు ఇప్పటి వరకు 20వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ పంపిణీ జరగాలి. రెండున్నర వేల కోట్ల రూపాయల వరకు కరెన్సీ తక్కువ పంపించారు.

12/14/2016 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలను నెలకోల్పేందుకు వీలు కల్పించే బిల్లుకు మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నాడు తుది రూపం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రులు కెటిఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు.

12/14/2016 - 04:00

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆర్థిక లావాదేవీలన్నింటినీ నగదు రహితంగా మార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సంస్థాగతంగా బ్యాంకులు బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణపై గ్రామ సభలు నిర్వహించి బ్యాంక్ అకౌంట్లు, కార్డుల నిర్వహణపై అవగాహన కల్పించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

12/14/2016 - 03:46

నల్లగొండ, డిసెంబర్ 13: తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లుగా 2019 ఎన్నికల్లో అధికారం దక్కుతుందో లేదో తెలియకపోయినా సీఎం పదవి తనదంటే తనదేనంటు టిపిసిసి సీనియర్ నేతల ప్రకటనలు వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌లో కలకలానికి, మిగతావారు నవ్వుకోవడానికి ఈ ప్రకటనలు ఉపకరిస్తున్నాయి.

12/14/2016 - 03:42

సిద్దిపేట, డిసెంబర్ 13 : భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మలన్న ఆలయంలో పుట్టమన్నుతో ఏర్పడిన స్వయంభూ మూలవిరాట్‌ను తొలగించి గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారాన్ని రేపాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, బేషరుతుగా క్షమాపణ చెప్పాలని వివిధ పార్టీల నేతలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

12/14/2016 - 03:40

గచ్చిబౌలి, డిసెంబర్ 13: గచ్చిబౌలీలోని ఓ హోటల్‌లో మటన్ బిర్యానీలో కుక్కమాంసం కలిపారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీంతో జిహెచ్‌ఎంసి ఆరోగ్యం, పారిశుద్ధ్యం విభాగం అధికారులు గచ్చిబౌలిలోని సదరు హోటల్‌పై తనిఖీలు నిర్వహించారు.

12/14/2016 - 03:37

హైదరాబాద్, డిసెంబర్ 13: అసెంబ్లీ ఆవరణలో బందోబస్తుకు వచ్చే పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చైర్మన్, స్పీకర్ మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

12/14/2016 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన 30 నెలల్లో మూడువేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

12/14/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ అనాథగా మారుతోంది. ఎంతోకాలంగా అనేక కేసులను యుద్ధప్రాతిపదికపై విచారణ చేసి తీర్పులు ఇస్తూ వస్తున్న ఈ కమిషన్, రెండు రాష్ట్ర ప్రభుత్వాల (తెలంగాణ-ఎపి) మధ్య నలుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నర ఏళ్లు గడిచినప్పటికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటివరకు ఇదే కమిషన్ కొనసాగుతోంది.

Pages