S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/23/2017 - 03:47

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం ఆయన నగరంలోని జివైఆర్ కాంపౌండ్‌లో రూ.15.57 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 168 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు.

04/23/2017 - 03:39

హైదరాబాద్, ఏప్రిల్ 22: ముస్లింలు తమకు ఓటు వేయకపోయినా కేంద్రం వారికి తగిన గౌరవం ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముస్లింలకు గుర్తింపు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రభుత్వం ఇచ్చింది కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

04/23/2017 - 03:38

హైదరాబాద్, ఏప్రిల్ 22: మరో ఏడు నెలలు గడిస్తే రాష్ట్రంలో 24వేల 248 గ్రామాల్లోని లక్షలాది కుటుంబాలకు ఇంటింటికి మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం పూర్తి కావాలి. 2019 ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటిని అందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సభల్లో ప్రకటించారు. అయితే 2017 డిసెంబర్ నాటికే ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా డిజైన్ చేశారు.

04/23/2017 - 03:36

హైదరాబాద్, ఏప్రిల్ 22: మంత్రి కెటిఆర్ ఐస్ క్రీంను రూ.5 లక్షలకు, ఆయన సోదరి, ఎంపి కవిత ఒక గంట చీరలు అమ్మితే రూ.6 లక్షలు వస్తున్నప్పుడు ఈ ఇద్దరు ఎనుమాముల మార్కెట్‌కు వెళ్లి క్వింటాల్ మిర్చిని రూ.10 వేలకు అమ్మొచ్చుగా..? అని టిటిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

04/23/2017 - 03:35

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఒక్కటే సరైన మార్గమని ఎంపి కె.కవిత అన్నారు. వాణిజ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శనివారం హైదరాబాద్ విచ్చేసింది. కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

04/23/2017 - 03:34

హైదరాబాద్, ఏప్రిల్ 22: టి.జెఎసి బలోపేతానికి చైర్మన్ కోదండరామ్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. టి.జెఎసి నుంచి ఇరువురు నేతల బహిష్కరణ తర్వాత బలహీనపడిందన్న ప్రచారం జరుగుతున్నది. దీనిని దూరం చేస్తూ, కింది స్థాయినుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు నగర శివారులోని ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.

04/23/2017 - 03:33

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలోని ఏడు స్థానిక సంస్ధల ప్రతినిధులు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకోబోతున్నారు. ఈ నెల 24న లక్నోలో జరిగే కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి చేతుల మీదుగా అవార్డులు తీసుకోనున్నారు.

04/23/2017 - 01:47

హైదరాబాద్, ఏప్రిల్ 22: సచివాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డి)గా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులతో పాటు ఉర్దూ లైజాన్ అధికారి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఓఎస్‌డిలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హెచ్‌ఎ.షఫీ, ఎ..రాంరెడ్డి, ఎ.చంద్రభాగ, ఉర్దూ లైజాన్ అధికారి మహ్మద్ జహీరుద్దీన్‌ల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.

04/23/2017 - 01:47

హైదరాబాద్, ఏప్రిల్ 22: కంటి వైద్య రంగంలో రెండు దశాబ్దాలుగా విశిష్ఠ సేవలందిస్తున్న డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు యుధ్‌వీర్ ఫౌండేషన్ 26వ వార్షిక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 30న రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో కేర్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ బి.సోమరాజు చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు.

04/23/2017 - 01:46

హైదరాబాద్, ఏప్రిల్ 22: కవాల్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో వాహనాల రాకపోకలను అనుమతించే విషయమై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Pages