S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/21/2017 - 02:48

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఈ నెల 26 నుండి మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మూడు రోజుల్లో ప్రారంభ వేడుకలు జరుగుతాయని, ఆ తర్వాత ఏడాది కాలంపాటు ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు.

04/21/2017 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 20: భానుడు గురువారం కాస్త తగ్గాడు. గత రెండు రోజులుగా చండప్రచండగా ఉన్న వేడి కాస్త తగ్గింది. మొన్న మహబూబ్‌నగర్‌లో, నిన్న ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన ఉష్ణోగ్రతలు గురువారం ఒక డిగ్రీ తగ్గి 44 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

04/20/2017 - 23:11

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా యూనివర్శిటీని రానున్న 50 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై సమగ్ర డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ ఫ్యాకల్టీ సభ్యులతో ఆయన సమావేశమై విభాగాల వారీ రానున్న ఐదు దశాబ్దాల్లో వర్శిటీని ఎలా తీర్చిదిద్దాలో సమీక్షించారు.

04/20/2017 - 23:10

హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జర్నలిస్టులకు ఆరోగ్య పథకం కింద 2-17-18 సంవత్సరానికి ‘హెల్త్ కార్డుల’ పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్డులను రెండు దశల్లో ఇస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇ. వెంకటేశం తెలిపారు.

04/20/2017 - 23:07

హైదరాబాద్, ఏప్రిల్ 17: మత ప్రాతిపదికపై రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలతో సమాధానం చెప్పాలని బిజెపి యోచిస్తోంది. ఇందుకు ప్రారంభ సూచకంగా సోమవారం రాష్టవ్య్రాప్తంగా బిజెపి నిరసన ప్రదర్శనలు చేపట్టింది. 20వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు, ధర్నాలు చేపట్టనుంది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది.

04/20/2017 - 23:06

హైదరాబాద్, ఏప్రిల్ 20: హైదరాబాద్‌లో ఈ నెల 22 నుండి 24 వరకు జాతీయ వ్యవసాయ సదస్సు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సర్వారెడ్డి వెంకురెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్ (ఎస్‌విఎఫ్‌డి), పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్స్ సొసైటీ (పిఆర్‌డిఐఎస్) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

04/20/2017 - 05:23

నల్లగొండ, ఏప్రిల్ 19: రైతు సమస్యలు, వేసవి తాగునీటి ఎద్దడి వంటి ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చకు వేదిక కావాల్సిన నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రొటోకాల్ వివాదంతో గాడితప్పి మంత్రి జి.జగదీష్‌రెడ్డి, సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధానికి వేదికైంది.

04/20/2017 - 04:40

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక సూత్రధారి శివ బహదూర్ సింగ్, అతని అనుచరుడు అనూప్‌కుమార్ సింగ్‌లను తెలంగాణ సిఐడి పోలీసులు బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈనెల 14న శివ బహదూర్ సింగ్ (ఎస్‌బి సింగ్), అనూప్‌కుమార్‌లు ఉత్తరప్రదేశ్‌లో జాన్‌పూర్‌లోని ఓ లాడ్జిలో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.

04/20/2017 - 04:40

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఎండాకాలం ప్రారంభమైన తర్వాత బుధవారం భానుడు (సూర్యుడు) భగ్గుమన్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం గిలగిలలాడారు. ఉదయం తొమ్మిది గంటల నుండే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకూ ఎండ తీవ్రత తీక్షణంగా ఉంటోంది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని వివిధ జిల్లాల్లో చాలా మంది వడదెబ్బకు గురయ్యారు.

04/20/2017 - 04:39

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పునర్‌వైభవం చేకూరుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, చెరువులు నీటితో నిండటంతో రైతులకు పండగవాతావరణం నెలకొని ఉంటుందని నీటిపారుదల మంత్రి టి. హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ మీడియా అవార్డులను బుధవారం ఆయన జలసౌధలో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి అందించారు.

Pages