S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2019 - 04:55

హైదరాబాద్, నవంబర్ 2: తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం శబరిమలకు వెళ్లడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 16 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నడుపుతారు. దాదాపు 12 ప్రత్యేక రైళ్లను హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్ నుంచి శబరిమలకు రైళను నడుపుతారు. హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ నుంచి 07109-07110 ప్రత్యేక రైలు నడుస్తుంది.

11/03/2019 - 04:54

హైదరాబాద్, నవంబర్ 2: ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం పార్టీ నేతలతో సమీక్షించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయికి వచ్చిన ఓట్ల శాతంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది.

11/03/2019 - 04:52

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బెదిరింపులతో సమస్యలను పరిష్కరించాలని చూస్తే సాధ్యం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేస్తామని చెబుతున్నారని, ప్రైవేటు పరం చేస్తే అవి ఆర్టీసీ కార్మికులు ప్రజల శవాలపై తిరగాలి లేదా ఆకాశంలో తిరగాలే తప్ప భూమి మీద తిరగడానికి లేదని స్పష్టం చేశారు.

11/03/2019 - 04:51

హైదరాబాద్, నవంబర్ 2: మిషన్ భగీరథ నీటి వినియోగంపై గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు 100 రోజులపాటు నిర్వహించడానికి కార్యాచరణను రూపొందించినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కృపాకర్‌రెడ్డి తెలిపారు.

11/03/2019 - 04:43

హైదరాబాద్, నవంబర్ 2: పౌరుల నైతిక ప్రవర్తన వల్లనే అవినీతి రహిత సమాజ నిర్మాణానికి భరోసా కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో రైల్వే విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రజలను చైతన్యం చేయడానికి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

11/03/2019 - 04:39

హైదరాబాద్, నవంబర్ 2: ఈనెల 28-30 తేదీల్లో జరగాల్సిన రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈమేరకు రైల్వే బోర్డు కార్మిక సంఘాల యూనియన్ నేతలకు సమాచారం పంపింది. రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం కోసం రైల్వే బోర్డు ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఇంకా రైల్వే బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తమ లేఖలో పేర్కొంది.

11/03/2019 - 04:38

హైదరాబాద్, నవంబర్ 2: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సమావేశంలో ప్రతిపాదిస్తున్న ఆర్ధిక ఒప్పందాన్ని భారత్ వ్యతిరేకించాలని ఆలిండియాకిసాన్ సభ జాతీయ కార్యదర్శి పశ్యపద్మ డిమండ్ చేశారు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టిపరిస్థితుల్లో సంతకం చేయరాదని ఆమె పేర్కొన్నారు.

11/03/2019 - 04:38

హైదరాబాద్, నవంబర్ 2: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు రూపొందించిన జాక్, అఖిలపక్షం రూపొందించిన కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీపీఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు పేర్కొన్నారు.

11/03/2019 - 04:37

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ వస్తే స్వేచ్ఛ ఉంటుందని భావించామని, సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక స్థితిని ధ్వంసం చేశారని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్వేచ్చ ప్రధానమైదని, ఆ స్వేచ్ఛను కేసీఆర్ హరించారన్నారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు.

11/03/2019 - 04:36

హైదరాబాద్, నవంబర్ 4: రాష్ట్రంలో హక్కులు, డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తున్న సంఘాలపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపి అణచివేయడం దారుణమని పీసీసీ నేత మల్లు రవి ధ్వజమెత్తారు.

Pages