S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/04/2019 - 01:23

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆహ్వానం అందింది. ప్రత్యేక ఆహ్వానితునిగా కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకుల నుంచి అందిన ఆహ్వాన పత్రంలో

11/04/2019 - 01:22

హైదరాబాద్: దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో యునానీ అద్భుతంగా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడి ఎర్రగడ్డ యూనానీ ఆసుపత్రిలో జాతీయ చర్మ వ్యాధుల యునానీ చర్మ వ్యాధుల వైద్య పరిశోధన సంస్థను ఆయన ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్, జీ కిషన్ రెడ్డి కలిసి ఆసుపత్రిలో ఔషధ మొక్కలను నాటారు. అనంతరం పరిశోధనా సంస్థ నూతన బ్లాక్‌ను ప్రారంభించారు.

11/04/2019 - 01:15

హైదరాబాద్: గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. సీఎం పిలుపు నేపథ్యంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లోని పలు డిపోల్లో కొందరు కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.

11/04/2019 - 01:14

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోగా విధుల్లో చేరడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అక్కడక్కడ స్పందన కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో పాటు వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు ముం దుకు వచ్చారు.

11/03/2019 - 23:51

కోదాడ, నవంబర్ 3: ఇచ్చిన హామీలను అమలుచేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనేనని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడారు. 70 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు.

11/03/2019 - 23:49

జగిత్యాల రూరల్, నవంబర్ 3: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పీఏ గిరీష్‌ఠాకూర్ ఆదివారం ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. ఎస్సై చిర్ర సతీష్ కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గిరీష్‌ఠాకూర్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏగా పని చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

11/03/2019 - 23:47

వెల్దండ, నవంబర్ 3: ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక, న్యాయమైన సమస్యల సాధన కోసం చేపట్టిన సమ్మె కొలిక్కి రాక త్రీవ మనస్థాపనికి గురై అత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసి డ్రైవర్ కల్వకొలు శ్రీశైలం అరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

11/03/2019 - 23:45

సంగారెడ్డి, నవంబర్ 3: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా తదితర అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను యావత్ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని సంతృప్తిని వ్యక్తం చేసారు.

,
11/03/2019 - 23:40

వరంగల్, నవంబర్ 3: వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో భారీ బందోబస్తు, ఉద్రిక్తతల మధ్య హన్మకొండ లోకల్ డిపో కండక్టర్ ఏరుకొండ రవీందర్ (53) అంత్యక్రియలు ఆదివారం ముగిసాయి. నాలుగు రోజుల కిందట తీవ్ర మనోవేదనకు గురైన రవీందర్‌కు గుండెపోటు రాగా ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

11/03/2019 - 23:37

దేవరకొండ, నవంబర్ 3: నల్లగొండ జిల్లాలో ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అటవీప్రాంతంలో ఉన్న గొర్రెల మంద వద్ద ఉన్న కంబాలపల్లి గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

Pages