S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/14/2017 - 02:12

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్-కోటా పెట్టాలని బిసి మహిళా సదస్సు డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు సంఘం కన్వీనర్ వై.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

02/14/2017 - 02:11

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రానున్న ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నాడిక్కడ గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

02/14/2017 - 02:10

మోర్తాడ్, ఫిబ్రవరి 13: తెలంగాణ వరప్రదాయినిగా విలసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రైతులు సమృద్ధిగా పంటలు పండించుకునేలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు సమకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.

02/13/2017 - 03:55

మెదక్, ఫిబ్రవరి 12: మెదక్ శ్రీ సత్యసాయి భజన మందిరంలో కొలువైన శ్రీ మహాగణపతి సన్నిధిలో శ్రీ సహస్ర చండీ మహాయాగం విజయవంతంగా ప్రారంభమైంది. సుమారు 150 మంది వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ పర్యవేక్షణలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి చండీ యాగం కొనసాగింది.

02/13/2017 - 03:53

హైదరాబాద్, ఫిబ్రవరి 12: పోలీసులకు విధి నిర్వహణ ప్రతి క్షణం కత్తిమీద సాములాంటిదని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. కమ్యూనికేషన్స్, రవాణా సౌకర్యం సక్రమంగా లేని రోజుల్లో పోలీస్ అధికారులు నేరాల నియంత్రణకు ఎంతో కృషి చేశారని, అలాంటి అనుభవం గల ఇంటెలిజెన్స్ అధికారులను స్ఫూర్తిగా తీసుకొని అప్రమత్తతతో సంఘ విద్రోహులను పట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

02/13/2017 - 03:51

నల్లగొండ, ఫిబ్రవరి 12: నల్లగొండ జిల్లాలో చదువుల ప్రాంగణం మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆదివారం కాంగ్రెస్, టిఆర్‌ఎస్ రాజకీయ రగడకు వేదికైంది. యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జి.జగదీష్‌రెడ్డితో ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ఎన్.

02/13/2017 - 03:49

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి రాజకీయ పార్టీగా అవతరించేందుకు కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి ప్రయత్నాలు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఒక రాజకీయ పార్టీగా రూపుదాల్చాలి అనేది జెఎసి ప్రణాళిక. దీనికి తగ్గట్టుగా శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

02/13/2017 - 03:47

నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 12: నల్లగొండ పట్టణానికి 14కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పాజిపేట గ్రామంలో 11, 12, 13వ శతాబ్దాలకు సంబంధించిన సప్తమాతృకల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయ. ఈ విగ్రహాలు నిరాదరణకు గురై మరుగున పడివుండడాన్ని స్థానికులు గుర్తించి వెలుగులోకి తెచ్చారు.

02/13/2017 - 02:08

హైదరాబాద్/ముషీరాబాద్, ఫిబ్రవరి 12: పార్లమెంటులో బిసి బిల్లు పెట్టడానికి త్వరలో ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బిసి సంఘాల నేతలు ఆదివారం బంజారాహిల్స్‌లోని వెంక య్య నివాసంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు బిసిల డిమాండ్ల గురించి ఆయనకు వివరించారు.

02/13/2017 - 02:06

హైదరాబాద్, ఫిబ్రవరి 12:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల నిర్వాహణ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది.

Pages