S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/10/2016 - 03:47

వరంగల్, అక్టోబర్ 9: తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వరంగల్ భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొక్కులు చెల్లించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమ్మవారిని దర్శించుకొన్న కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే బంగారు కిరీటం బహూకరిస్తానని మొక్కుకున్నారు.

10/10/2016 - 03:44

హైదరాబాద్, అక్టోబర్ 9: బతుకమ్మ పాటలు న్యూజిలాండ్‌లో మార్మోగాయి. ఆ దేశ రాజధాని ఆక్లాండ్ సిటీ బతుకమ్మ ఆట పాటలతో పులకించింది. తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ, న్యూజిలాండ్ తెలంగాణ సంఘం సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువుగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబురాలకు హాజరయ్యారు.

10/10/2016 - 03:42

హైదరాబాద్, అక్టోబర్ 9: ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల పందేరానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దసరా పండుగ సందర్భంగా శ్రీకారం చుట్టారు. పార్టీ విధేయులకే నామినేటెడ్ పదవులు దక్కాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కొందరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశం కల్పించారనే అపప్రధ ముఖ్యమంత్రిపై ఉన్న సంగతి తెలిసిందే.

10/10/2016 - 03:40

వరంగల్, అక్టోబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటు లెక్కతేలింది. 31 జిల్లాలతో నేడోరేపో మంత్రివర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల ఏర్పాటు ఫైనల్ ముసాయిదాను విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈవిషయాన్ని స్వయంగా సిఎం కెసిఆర్ ఆదివారం వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

10/10/2016 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ రాష్ట్ర సమితి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ తమ పార్టీ, ఇతర పార్టీలతో కలిసి నెల రోజులుగా ప్రజా ఉద్యమం చేస్తున్నదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కె.

10/10/2016 - 03:26

వరంగల్, అక్టోబర్ 9: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు దసరా, నూతన జిల్లాల ఏర్పాటు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వరంగల్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గొప్పగా జరిగాయని, వచ్చే సంవత్సరం మహిళలు బతుకమ్మ ఉత్సవాలను మరింత గొప్పగా జరుపుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

10/10/2016 - 03:24

సంగారెడ్డి, అక్టోబర్ 9: మంజీర నది పరివాహక ప్రాంతాలు, సింగూర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద పోటు మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి పశ్చిన మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలకు వరద పెరిగింది. దీంతో ఆదివారం ఉదయం సాగునీటి పారుదల శాఖ అధికారులు రెండు మీటర్ల చొప్పున రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్‌కు వదిలిపెడుతున్నారు.

10/10/2016 - 03:23

బాల్కొండ, అక్టోబర్ 9: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి వరదనీటి ఉద్ధృతి పెరగడంతో అధికారులు మరోమారు ఆదివారం రిజర్వాయర్‌కు చెందిన 42గేట్లను ఎత్తివేశారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు మిగులు జలాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో రిజర్వాయర్‌లోకి 3.20లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

10/10/2016 - 03:20

మానవపాడు, అక్టోబర్ 9: మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (40) అలంపూర్ చౌరస్తాలోని ఫ్లై ఓవర్‌పై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి అనంతపురంకు వెళ్తున్న డిసిఎం ఢీకొట్టింది.

10/10/2016 - 03:20

చిగురుమామిడి, అక్టోబర్ 9: సిఎం దత్తత గ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌లో శనివారం డబుల్ బెడ్‌రూం ఇల్లు కుప్పకూలింది. రాష్ట్రంలోనే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృధ్ధి చేసి నిలపాలనే సిఎం తపనకు, ఆలోచనకు బ్రేక్ వేసే ప్రయత్నాల్లో భాగంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Pages