S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/07/2016 - 02:24

హైదరాబాద్, అక్టోబర్ 6: ఒకవైపు కొత్త జిల్లాలు ఖరారై, జిల్లా కేంద్రాల ఏర్పాటు కోసం ఏర్పాట్లు పూర్తి అవుతుండగా, మరోవైపు కొత్త జిల్లాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. 31 జిల్లాలకు మించి పరిశీలించేది లేదు, మంత్రులెవరూ మరిన్ని డిమాండ్ల గురించి మాట్లాడవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించిన తరువాత కూడా పలువురు మంత్రులు కొత్త జిల్లాల డిమాండ్లు వినిపించారు.

10/06/2016 - 08:25

హుజూరాబాద్, అక్టోబర్ 5: కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ కేంద్రంగా పివి నరసింహారావు జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జెఎసి నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద జెఎసి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు జెఎసితో పాటు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

10/06/2016 - 08:25

గోవిందరావుపేట, అక్టోబర్ 5: వరంగల్ జిల్లాలో ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలో రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతోపాటు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో బుధవారం మండలంలోని అన్ని వ్యాపార వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

10/06/2016 - 08:24

మహబూబ్‌నగర్, అక్టోబర్ 5: మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త జిల్లాలపై రగడ కొనసాగుతూనే ఉంది. నారాయణపేట జిల్లా ప్రకటించాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఏకంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా కర్ణాటక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దాంతో ఒక్కసారిగా నారాయణపేటలో 48 గంటల బంద్‌కు జనం శ్రీకారం చుట్టారు.

10/06/2016 - 08:22

సంగారెడ్డి, అక్టోబర్ 5: మంజీర పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సింగూర్ ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరద పోటు వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు వరద రాకను అంచనా వేసిన సాగునీటి పారుదల శాఖ ఈఈ రాములుగౌడ్ 70 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు తెలిపారు.

10/06/2016 - 08:22

నాగార్జునసాగర్, అక్టోబర్ 5: గత రెండురోజులుగా నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టగా బుధవారం సాయంత్రం నుండి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. శ్రీశైలంలోని విద్యుత్ ఉత్పత్తి ద్వారా బుధవారం సాయంత్రం 40,685 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగులకుగాను 533 అడుగులుగా ఉంది. ఎడమకాల్వ ద్వారా మంగళవారం నుండి నీటి విడుదల కొనసాగిస్తున్నారు.

10/06/2016 - 08:21

సంగారెడ్డి, అక్టోబర్ 5: స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మారో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కొండాపూర్ ఎఎస్‌ఐ రజాక్ కథనం ప్రకారం...

10/06/2016 - 08:20

మెదక్, అక్టోబర్ 5: మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లాల 2016 ఫుట్‌బాల్ బాలుర చాంపియషన్‌షిప్ క్రీడలను రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రీడలలో పాల్గొన్న 10 జిల్లాల బాలలు నిర్వహించిన మార్చ్ఫాస్ట్‌ను మంత్రి స్వీకరించారు.

10/06/2016 - 08:14

భద్రాచలం, అక్టోబర్ 5: జిల్లాల పునర్విభజన రచ్చకెక్కింది. తెలంగాణ ప్రభుత్వం తీరును అధికార పార్టీ నేతలు సైతం తప్పుపడుతూ నిరసన గళం విప్పారు. ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాలను వరంగల్ జిల్లాలో నూతనంగా ఏర్పడనున్న భూపాల్‌పల్లిలో విలీనం చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు.

10/06/2016 - 07:59

హైదరాబాద్, అక్టోబర్ 5: ‘ఎన్టీఆర్ శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలన్న కేసీఆర్ ఆలోచన సంతోషమే. ఎన్టీఆర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు’.

Pages