S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/09/2016 - 03:22

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి రెండున్నర ఏళ్ళు గడిచినందున, ప్రభుత్వ వైఫల్యాలపై ఇక ప్రజా ఆందోళనలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు మండల స్థాయిలో రైతుల సమస్యలపై ఉద్యమించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి. ప్రేమేందర్ రెడ్డి, ప్రసాద్ కుమార్, కార్యదర్శి డాక్టర్ ఎస్.

10/09/2016 - 03:20

హైదరాబాద్, అక్టోబర్ 8: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఓపెన్ డాటా కాన్ఫరెన్స్‌లో తెలంగాణ స్వరం వినిపించే మహత్తరమైన అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంను కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఆహ్వానించారు.

10/08/2016 - 06:41

హైదరాబాద్, అక్టోబర్ 7: సీనియర్ ఐఎఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు మైనింగ్‌ను అక్రమంగా కేటాయించారని సిబిఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. 2011 డిసెంబర్‌లో ఆమెను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

10/08/2016 - 06:40

హైదరాబాద్, అక్టోబర్ 7: వివిధ పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించడంపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఒక అడుగు ముందుకు పడింది. ఫిరాయింపులపై ఈ నెల 19న సుప్రీం కోర్టు విచారించనుంది. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 47 మంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరారు.

10/08/2016 - 06:39

హైదరాబాద్, అక్టోబర్ 7: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ జల చౌర్యానికి పాల్పడుతోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుతో కృష్ణా యజామాన్య బోర్డు ఉమ్మడి పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. ఉమ్మడి పర్యవేక్షణ మంచి ఫలితాలను ఇస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

10/08/2016 - 06:37

హైదరాబాద్, అక్టోబర్ 7: ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా ఒకేచోట, ఒకేసారి 15వేల మంది మహిళలు బతుకమ్మ ఆడనున్నారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం మహా బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు రెండు గంటల పాటు పదిహేను వేల మంది బతుకమ్మ ఆడుతారు.

10/08/2016 - 06:36

హైదరాబాద్/ గచ్చిబౌలి, అక్టోబర్ 7: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కేవలం నిరాశ, నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని రూపన్‌వాలా కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని యూనివర్సిటీ జెఎసి నాయకులు విమర్శించారు. రూపన్‌వాలా నివేదికను వ్యతిరేకిస్తూ శుక్రవారం యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు.

10/08/2016 - 06:35

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి నుండి విద్యారంగంలో అన్ని అంశాల్లోనూ ఆధార్‌నే ఆధారంగా చేసుకోవాలని రెండు ప్రభుత్వాలూ నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్య ఆధారంగానే ప్రవేశపరీక్ష నిర్వహణ, అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ మంజూరు, అటెండెన్స్ పర్యవేక్షణ కూడా కొనసాగనుంది.

10/08/2016 - 06:34

హైదరాబాద్, అక్టోబర్ 7: శతాబ్దాల నుండి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ మహిళాలోకం చేసుకుంటున్న బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయాలని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామమోహన్ పేర్కొన్నారు.

10/08/2016 - 06:26

హైదరాబాద్, అక్టోబర్ 7: వివిధ ఆలయాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో మొక్కుకున్న మొక్కులను వరుసగా తీర్చనున్నారు. తొలుత వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా మొక్కు తీర్చనున్నారు. పదకొండు కిలోల ఏడు వందల గ్రాముల స్వర్ణ కిరీటాన్ని అమ్మవారి కోసం జీఆర్టీ జువెలర్స్ వారితో తయారు చేయించారు.

Pages