S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/05/2016 - 08:20

భద్రాచలం, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో మూడోసారి గోదావరికి వరదలు రావడంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంతో భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం నాటికి 37 అడుగులకు వరద నీటిమట్టం పెరిగింది.

10/05/2016 - 08:19

హైదరాబాద్, అక్టోబర్ 4: భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణలో భూగర్భ నీటి మట్టం ఎనిమిదిన్నర మీటర్లకు పెరిగింది. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు దోహదం చేసింది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో తప్ప హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ నీటి మట్టం భారీగా పెరిగింది. నీటిమట్టం పెరుగుదలపై తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖ అధ్యయనం చేసింది.

10/05/2016 - 08:17

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏడు విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్ల నియామకాలు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఏడు విశ్వవిద్యాలయాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వమే నియామాక ఉత్తర్వులను జారీ చేసింది. కాని రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకూ గవర్నరే చాన్సలర్‌గా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

10/05/2016 - 08:09

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎల్‌ఈడి వీధి దీపాలు ఎర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఎల్‌ఈడి లైట్ల ఏర్పాట్ల పురోగతిపై ఆయా సంస్థల ప్రతినిధులతో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థ యస్‌యస్‌ఎల్ యండి సౌరభ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

10/05/2016 - 08:08

హైదరాబాద్, అక్టోబర్ 4: జెఎన్‌టియు హైదరాబాద్‌ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. కీలక పదవుల్లో మార్పులు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్‌గా మంజూరు హుస్సేన్‌ను నియమించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా గుప్త స్థానంలో తార కళ్యాణిని నియమించారు. డియుఎఫ్‌ఆర్ డైరెక్టర్‌గా డాక్టర్ ఎం విశ్వనాధం స్థానంలో చెన్న కేశవరెడ్డిని నియమించారు.

10/05/2016 - 08:08

హైదరాబాద్, అక్టోబర్ 4: రాష్ట్ర ప్రభుత్వంపై మజ్లిస్ పార్టీ ఒత్తిడి జిల్లాల ఏర్పాటులోనూ విస్తరించిందని బిజెపి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి విమర్శించారు. మజ్లిస్ ప్రమేయం ఇంతకాలం జిహెచ్‌ఎంసి పరిధికే పరిమితం అనుకున్నామని, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నదని వారు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

10/05/2016 - 08:07

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ గ్రామాల సంఖ్యను పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తొలుత జిల్లాల పునర్వ్యస్థీకరణ ఒక కొలిక్కి వచ్చి, అవి ప్రారంభం అయిన తర్వాత పరిపాలనాపరంగా కిందిస్థాయిలో చేపట్టాల్సిన సంస్కరణలకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది.

10/05/2016 - 07:59

హైదరాబాద్, అక్టోబర్ 4: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరైన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన టిఆర్‌ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత వెంకటేశ్వర్‌రెడ్డి కర్ణాటకలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ భాగ్ అంబర్‌పేట లోని వైభవ్ నగర్‌లో నివాసముంటున్న ఆయన కొంతకాలం నుంచి బెంగుళూరులో ఉంటున్నట్టు తెలిసింది.

10/05/2016 - 07:54

హైదరాబాద్, అక్టోబర్ 4: రైతుల రుణమాఫీ, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల బకాయిలపై పోరాటం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

10/05/2016 - 06:23

హైదరాబాద్, అక్టోబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటవుతున్న నేపథ్యంలో పోలీసు, రెవిన్యూ వ్యవస్థలో కీలక మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలతోపాటు కొత్తగా ప్రతిపాదించిన గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా కార్యాలయాల ఎంపిక, అధికారులు, ఉద్యోగుల నియామకం చేపట్టాలని ఆదేశించారు.

Pages