S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/08/2016 - 06:22

హైదరాబాద్/ శేరిలింగంపల్లి, అక్టోబర్ 7: మియాపూర్‌లో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలు ధ్వంసం చేసి సుమారు 20లక్షల రూపాయల విలువచేసే 70 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులు దోచుకుని ఉడాయించారు. పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా బీరువాపై నీళ్ళు కుమ్మరించి పారిపోయారు.

10/08/2016 - 06:22

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణలో నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మా టీవిలో ప్రసారాలు చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని, అభ్యర్థుల సూచనలు సలహాల మేరకు కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నట్టు మా టీవి సిఇఓ శైలేష్‌రెడ్డి తెలిపారు. కేబుల్ ఆపరేటర్లతో జరిపిన సమావేశంలో మా టీవి చానల్స్‌ను కేబుల్ టీవిలో ప్రసారం చేసేందుకు అంగీకరించారు.

10/08/2016 - 06:21

హైదరాబాద్, అక్టోబర్ 7: ఇకపై ప్రభుత్వ ముద్రణ పనులు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లకే అప్పగించనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు వచ్చే కృషి చేస్తున్నట్టు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ప్రైవేటు ప్రెస్సులను ప్రోత్సహించి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.

10/08/2016 - 06:21

నాగార్జునసాగర్, అక్టోబర్ 7: నాగార్జునసాగర్ నాడు శుక్రవారం నాడు ప్రపంచ బౌద్ధ ప్రతినిధులు సందర్శించారు. ఈసందర్భంగా తెలంగాణ పర్యాటక సంస్థవారి ప్రత్యేక లాంచిలో నాగార్జునకొండకు చేరుకోని అక్కడ మహాస్థూపాన్ని, సింహళ విహారాన్ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి పునర్‌నిర్మిత స్థూపాలను, విహారాలను శ్రద్ధతో వీక్షించారు.

10/08/2016 - 06:20

హైదరాబాద్, అక్టోబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటు వేడుకల నిర్వహణపై శుక్రవారం జరిగిన మంత్రిమండలిలో చర్చ జరిగింది.

10/08/2016 - 06:06

హైదరాబాద్, అక్టోబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటనకు చట్టపరంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్డినెన్స్ తేవాలని మంత్రిమండలి నిర్ణయించింది.

10/08/2016 - 06:04

హైదరాబాద్, అక్టోబర్ 7: వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కమిషన్ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నట్టుగానే బీసీ విద్యార్థుల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల విద్యా సంస్థ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

10/08/2016 - 03:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండోరోజు సుమారు 15 మందికిపైగా పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌పి, జెకె టైర్స్, జీఈ, జడ్‌టిఇ, అశోక్ లేలాండ్, డిహెచ్‌ఎల్, సీమెన్స్, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన కెటిఆర్..

10/08/2016 - 03:26

షాద్‌నగర్, అక్టోబర్ 7: ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాలుగా భావించాల్సిన అధికారులే అక్కడే చిత్తుగా మద్యం సేవించి మత్తులో మునిగి తేలారు. శుక్రవారం మధ్యాహ్నం షాద్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టర్‌ను పక్కన కుర్చోబెట్టుకొని ముగ్గురు ట్రాన్స్‌కో ఏఇలు కార్యాలయ పనివేళ్లల్లో చిత్తుగా మద్యం సేవించారు.

10/08/2016 - 03:23

వరంగల్, సెప్టెంబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసినా వరంగల్‌లో జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. 27 జిల్లాలకు పైగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని మాత్రం చెపుతున్నారు. తాజా ఆందోళనల నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ డ్రాఫ్టు విడుదల చేసే వరకు గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Pages