S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/08/2016 - 03:21

మహబూబ్‌నగర్, అక్టోబర్ 7: కేంద్రం తెలంగాణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని.. కానీ టిఆర్‌ఎస్ నాయకులు కేంద్రంపై అక్కసు కక్కడం మంచి పద్ధతి కాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హితవు పలికారు. మహబూబ్‌నగర్‌లో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, అన్సరాజ్ గంగారామ్ అయ్యర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

10/08/2016 - 03:19

కరీంనగర్, అక్టోబర్ 7: దసరా అనంతరం కరీంనగర్ జిల్లా పరిషత్ రికార్డు సృష్టించబోతుంది. అది అషామషీ కాదు..రాష్ట్రంలో మరే జడ్పీకి దక్కని రికార్డును సొంతం చేసుకోబోతుంది. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఏడు జిల్లాలకు ప్రాతినిత్యం వహించబోతుంది. సువిశాల విస్తీర్ణం కలిగి, 57 మండలాలతో కొనసాగుతున్న కరీంనగర్ జిల్లాను జిల్లాల విభజన ప్రక్రియలో నాలుగు జిల్లాలుగా విభజించారు.

10/08/2016 - 03:16

హైదరాబాద్, అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతిని ‘రాష్ట్ర కార్యక్రమం’ (స్టేట్ ఫంక్షన్) గా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేరుతో శుక్రవారం జీఓ (నెంబర్ 2199) జారీ అయింది. ఈ నెల 16 న వాల్మీకి జయంతి జరుపుకుంటున్నారు. వాల్మీకి జయంతి వేడుకలను జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

10/08/2016 - 03:15

హైదరాబాద్, అక్టోబర్ 7: వివిధ జిల్లాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్, వైస్ చైర్మన్‌గా కోరెం సంతోష్‌లను నియమించారు. వర్థన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గుజ్జ సంపత్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ ఎండి నరుూమ్, ఎనుమాముల చైర్మన్‌గా కొంపెల్ల ధర్మరాజు, వైఎస్ చైర్మన్ ఇ.

10/07/2016 - 05:12

హైదరాబాద్, అక్టోబర్ 6: శాసన మండలి సభ్యునిగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి, శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో జరిగిన ఈ ఎన్నికకు ఫరీదుద్దీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు గురువారం అధికారికంగా ప్రకటించారు. మండలి సభ్యునిగా ఎన్నికైన ఫరీదుద్దీన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

10/07/2016 - 05:10

వరంగల్, అక్టోబర్ 6: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల విభజన ప్రక్రి య గులాబీ పార్టీ మధ్య చిచ్చురేవుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామలో కలపడంపై డి ప్యూటీ సిఎం కడియం శ్రీహరి వర్గం తో పాటు అఖిలక్ష నాయకులు వ్యతిరేకిస్తుండగా నియోజకవర్గ ఎమ్మెల్యే , మాజీ డిప్యూటీ సిఎం డాక్టర్ టి. రాజయ్య వర్గం కొత్తగా ఏర్పాటు కానున్న జనగామ జిల్లాలోనే కలపాలని పట్టుపడుతున్నారు.

10/07/2016 - 05:08

వేములవాడ, అక్టోబర్ 6: కరీంనగర్ జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి కొలువైన వేములవాడ పట్టణంలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే రీతిలో జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళాలోకం మూలవాగుకు తరలివచ్చింది. సద్దుల బతుకమ్మ వేడుకతో ఊరూవాడా ఉత్సవ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను చేసిన మహిళలు సాయంసంధ్యలో ఊరి మధ్యకు చేరి అంతా ఆడి, పాడారు.

10/07/2016 - 05:07

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జిల్లాల ఏర్పాటును సవాలు చేస్తూ సత్యప్రసాద్, చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన మూడు పిల్స్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సునీల్ చౌదరి విచారించారు.

10/07/2016 - 05:06

కేతేపల్లి, అక్టోబర్ 6: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామశివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో 26 మంది బస్సు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

10/07/2016 - 05:06

నల్లగొండ, ఆక్టోబర్ 6: జిల్లాల పునర్విభజన తుది ఘట్టానికి చేరుకుంటున్న క్రమంలో ప్రజల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోరుతూ గురువారం మిర్యాలగూడ బంద్ పాటించి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. దామరచర్లలో సైతం మిర్యాలగూడ జిల్లా కోసం రాస్తారోకో నిర్వహించారు.

Pages