S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/04/2020 - 06:36

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 3: ప్రాణం ఉన్నంత వరకు తాను టీఆర్‌ఎస్‌లో కొనసాగుతానని, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

02/04/2020 - 06:34

మిర్యాలగూడ, ఫిబ్రవరి 3: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 9 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 18,133 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని 9 సహకార సంఘాల్లో 117 వార్డుల్లో 18,133 మంది ఓటర్లున్నారు. అయితే అధికారులు ఓటర్ల జాబితాను, సంఘాల డైరెక్టర్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు.

02/04/2020 - 06:34

సూర్యాపేట, ఫిబ్రవరి 3: జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్‌కృష్ణారెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా పనిచేస్తున్న దుగ్యాల అమయ్‌కుమార్ గత నెల 27న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి చేపట్టిన ఏఎఎస్‌ల బదిలీల్లో భాగంగా జనగాం కలెక్టర్‌గా పనిచేస్తున్న వినయ్‌కృష్ణారెడ్డిని ఇక్కడికి బదిలీ చేశారు.

02/04/2020 - 06:33

సిద్దిపేట, ఫిబ్రవరి 3 : కొండపాక పరిసర గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలు నెహ్రూ యువ కేంద్రాలతో అనుసంధానం చేసుకోవాలని ఎన్‌వైకే జిల్లా కోఆర్టీనేటర్ బిన్సీ అన్నారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో నెహ్రూ యువక కేంద్రం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ క్లబ్ డెవలప్‌మెంట్ కనె్వన్షన్ కార్యక్రమంలో ఎన్‌వైకే జిల్లా కోఆర్డినేటన్ బిన్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

02/04/2020 - 06:04

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ఉందని, ప్రజలకు వైద్యపరంగా పూర్తి రక్షణ కల్పిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానాలో వైరాలజీ లాబ్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు.

02/04/2020 - 06:01

హైదరాబాద్: ఈ నెల 11న ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సమావేశం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలన్నీ ముగియడంతో ఇకనుంచి పరిపాలనను పట్టాలు ఎక్కించే అంశంపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

02/04/2020 - 05:59

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస ఎన్నికలు, వాటి కోడ్‌తో పరిపాలన పట్టాలు ఎక్కలేకపోయింది. ఇప్పటికే అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మినహా కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతికంగా ఎన్నికల కోడ్‌లు అవరోధంగా నిలిచాయి. దీంతో పరిపాలన స్థంభించింది.

02/04/2020 - 05:57

హైదరాబాద్: కేంద్రం సంక్షేమ పథకాలను ప్రకటించి, వాటికి నిధులను సమకూరుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాల పేర్లను సవరించుకుని, నిధులు వాడుకుని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కుమారుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూనిరాగాలు తీస్తున్నారని, రాష్ట్రానికి ఆయన గజనీలా తయారయ్యారని ఎద్దేవా చేశారు.

02/03/2020 - 22:21

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెండు రోజుల పర్యటనకు శనివారం హైదరాబాద్ వచ్చిన భారతరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ వెళ్లిపోయారు. శనివారం హైదరాబాద్‌లోనే రాష్ట్రపతి దంపతులు మకాం చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం సందర్శించారు.

02/03/2020 - 07:21

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రతిసారీ అన్యాయమే జరుగుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది ఆరవ బడ్జెట్ అని ఆయన గుర్తు చేశారు.

Pages