S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/13/2018 - 06:21

మహబూబ్‌నగర్, అక్టోబర్ 12: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ప్రచారంలో అపశృతి నెలకొంది. బహిరంగ సభ వేదిక కుప్పకూలింది. విజయశాంతి ప్రసంగిస్తుడంగా ఒక్కసారిగా స్టేజీ కూలడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం నుండి విజయశాంతి, భట్టి విక్రమార్కలు భయటపడ్డారు.

10/13/2018 - 06:19

మెదక్, అక్టోబర్ 12: అబద్దాల కోరు కేసీఆర్ అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి.హన్మంతరావు ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ రథయాత్ర ప్రారంభంలో భాగంగా జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి ఆ రథయాత్ర మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంది. హన్మంతరావు రథయాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకడమే కాకుండా భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.

10/13/2018 - 06:18

చింతపల్లి, అక్టోబర్ 12: ప్రజలకు మాయమాటలు చెప్పి శుష్క వాగ్దానాలు చేస్తున్న కూటమి అభ్యర్థుల ఓటమి తథ్యమని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

10/13/2018 - 06:17

నిర్మల్, అక్టోబర్ 12: త్వరలోనే తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని, ఇక్కడి కేసీ ఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.

10/13/2018 - 01:36

హైదరాబాద్, అక్టోబర్ 12: డీ శ్రీనివాస్ రాజీనామాతో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటును అదే జిల్లాకు చెందిన కెఆర్ సురేశ్‌రెడ్డికి కేటాయించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం యోచిస్తోన్నట్టు సమాచారం. డీఎస్ తనంతకుతాను రాజీనామా చేస్తే తప్ప రాజ్యసభ సీటు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అంతకుముందే పార్టీ సస్పెండ్ చేస్తే పదవీకాలం (ఆరు సంవత్సరాలు) ముగిసే వరకు ఆయన కొనసాగడానికి అవకాశం ఉంది.

10/13/2018 - 06:34

ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో తెరాస అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అసమ్మతి నేతలందరినీ రాజధానికి వచ్చి కలవాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు మినహా మిగిలిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

10/13/2018 - 01:42

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ శుక్రవారం ఇక్కడ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎన్నికల కోడ్‌ను తూ.చ తప్పకుండా పాటించడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం హెలీకాప్టర్‌ను వినియోగించడానికి ఈసీ అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు.

10/13/2018 - 01:34

హైదరాబాద్, అక్టోబర్ 12: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 22 నుండి లాసెట్ కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ బీ ద్వారకానాధ్ తెలిపారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఈ నెల 25వ తేదీ వరకూ జరుగుతుందని చెప్పారు. వెబ్ ఆప్షన్లను ఈ నెల 23 నుండి 27 వరకూ నమోదు చేసుకోవచ్చని అన్నారు.

10/13/2018 - 01:33

హైదరాబాద్, అక్టోబర్ 12: టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమీత్ షా, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆయన శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలో అమీత్ షా పర్యటన ఒక డ్రామా అని ఆయన దుయ్యబట్టారు.

10/13/2018 - 01:33

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థులపై రేగిన అసమ్మతి సెగలు దాదాపు సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. అయితే అధిష్ఠానం బుజ్జగింపుతో చల్లబడిన నేతలు సహకరిస్తారా? లేదా? అనే అనుమానాలు అభ్యర్థుల్లో ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి.

Pages