S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/15/2018 - 05:54

వరంగల్, అక్టోబర్ 14: చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని శ్రీ్భద్రకాళి దేవస్ధానంలో అత్యంతవైభవంగా శరనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు భవానిగా భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజ కాగానే అమ్మవారికి నవరాత్రి విశేష సేవలు ప్రారంభమైనాయి.

10/15/2018 - 03:54

సిద్దిపేట, అక్టోబర్ 14 : టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రత్యేక అజెండాతో ముందుకు రాబోతుందని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్లు సైతం పెంచే యోధనలో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

10/15/2018 - 03:51

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితికి, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగత అభిమాని అయిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన రోహిత్‌రెడ్డి అనే యువకుడు పాదయాత్ర ద్వారా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. 17 రోజుల కిందట విజయవాడ నుంచి కాలినడకన బయలుదేరిన రోహిత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వాసి.

10/15/2018 - 06:06

హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గ పాలన అంతానికే ఇతర ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకుంటున్నామని ఏఐసీసీ నాయకుడు మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఒంటిరిగా పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఓట్లు చీలిపోరాదన్న భావనతో కలిసి వచ్చే పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆదివారం మాసబ్ ట్యాంక్, గోల్కండ హోటల్‌లో కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరిగింది.

10/15/2018 - 02:40

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ కోరారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి (స్వయం ప్రతిపత్తి) ఆర్‌కే సింగ్‌కు ఆదివారం ఆయన ఒక లేఖరాశారు. తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం-వార్దా తదితర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. దత్తాత్రేయ లేఖకు కేంద్రం వెంటనే స్పందించింది.

10/15/2018 - 01:58

హైదరాబాద్, అక్టోబర్ 14: కేసీఆర్‌ను ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లతో కేటీఆర్ పోల్చడం పట్ల టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింహులు ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశప్రజల మన్ననలను పొందిన వ్యక్తులుగా ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లు పేరుతెచ్చుకున్నారన్నారు.

10/15/2018 - 01:57

హైదరాబాద్, అక్టోబర్ 14: ఎన్నికల ఖర్చుపై కేంద్ర ఎన్నికల కమిషన్ విధించిన 28 లక్షల రూపాయల పరిమితి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సమయంలో 28 లక్షల రూపాయల మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల కమిషన్ పరిమితి విధించింది. వాస్తవంగా ఇంతే ఖర్చుతో ఏ అభ్యర్థీ తన ప్రచారాన్ని పూర్తి చేయలేడు.

10/15/2018 - 01:57

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణలో రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ టీఆర్‌ఎస్‌కు బినామీగా పనిచేయడం పట్ల తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వామపక్ష భావాలు ఉన్న సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌కు వంతపలకడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

10/15/2018 - 01:56

హైదరాబాద్, అక్టోబర్ 14: ఓటర్ల నమోదు ప్రక్రియలో అనేక తప్పులు దొర్లాయి కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నా, పరిష్కారం కావడం లేదన్నారు. రెండు రోజుల క్రితం ఈవీఎంల గోడౌన్‌ను తెరిచారని, మళ్ళీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గోడౌన్ తెరిచారని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

10/14/2018 - 07:16

ఎన్నికల భూమి......
==============

Pages