S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/11/2018 - 06:09

హైదరాబాద్, అక్టోబర్ 10: తూర్పువైపున ఉన్న ఆంధ్రప్రదేశ్, చెన్నై, పశ్చిమబంగ్లా రాష్ట్రాల్లో తిత్లీ తుపాన్‌తో అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాటి ప్రభావం ఎక్కవగా ఉంటుందన్న సమాచారంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్ళను రద్దు చేసి, కొన్ని రైళ్ళను దారిమళ్లీంచారు. తదుపరి రైళ్ల సమాచారం చెప్పేవరకు ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్ సూచించారు.

10/11/2018 - 06:08

హైదరాబాద్, అక్టోబర్ 10: కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహాకూటమిగా ఏర్పడినప్పటికీ పొత్తుల చర్చలు తేలడం లేదు. రెండు రోజుల్లో తేల్చేయాలని ప్రతి రోజూ ఇలా అనుకుంటున్నా, కొలిక్కి రావడం లేదు. మాసాబ్ ట్యాంక్‌లోని గోల్కండ హోటల్‌లో మంగళవారం టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.

10/11/2018 - 06:07

హైదరాబాద్, అక్టోబర్ 10: మహాకూటమి ఏర్పాటుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్దూం భవనంలో సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, డా. బీ సుధాకర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని రద్దు చేసిన తరువాత కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు.

10/11/2018 - 03:57

హైదరాబాద్, అక్టోబర్ 10: బతుకమ్మ పండగలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో మహిళా ఉద్యోగులు బుధవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. అందరూ కలిసి బతుకమ్మలను తయారు చేసి, కోలాటం వేశారు. పాటలు పాడారు. బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు నుండి కూడా సచివాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు.

10/11/2018 - 03:54

సంగారెడ్డి, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఏదంటే ఎవరైనా గజ్వేల్ అని చెప్పక తప్పదు. గడచిన 2014 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గులాబీ దళపతి గెలుపొందాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ను బలంగా దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో పార్టీలన్ని ఏకమై మహాకూటమిగా జతకట్టాయి.

10/11/2018 - 03:52

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 10: చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు ముందస్తు ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలు పిలుపునిచ్చారు.

10/11/2018 - 03:50

హైదరాబాద్, అక్టోబర్ 10: కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తరుణంలోనే మహా కూటమి ఏర్పడిందని, మహా కూటమిని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. ఆశీర్వాద సభల పేరుతో టీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే టీఆర్‌ఎస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని, పరిగెట్టిస్తున్నారని అన్నారు.

10/11/2018 - 03:50

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి పెండింగ్‌లో పెట్టిన 14 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల ప్రకటనకు అమావాస్య అడ్డురావడంతో ఇంతకాలం ఆగిన అధిష్ఠానం గురువారం లేక శుక్రవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. శాసనసభ రద్దు చేసిన రోజుననే 119 శాసనసభ నియోజకవర్గాలకుగాను 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

10/10/2018 - 16:39

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేశారు. ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని అన్నారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతారని ఆయన అన్నారు.

10/10/2018 - 12:47

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో 34మంది పేర్లు ఉన్నాయి. అందరూ సిట్టింగ్ అభ్యర్థులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Pages