S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/12/2018 - 02:15

ఎన్నికల భూమి......

10/11/2018 - 17:09

హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని అన్నారు.

10/11/2018 - 17:04

హైదరాబాద్: అమరుల ఆకాంక్షలే తమ అజెండా అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. న్యాయవాది ప్రహ్లాద్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే పొత్తులు సాఫీగా జరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు సానుకూల స్పందన లభించిందని అన్నారు.

10/11/2018 - 12:55

బాసర: శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

10/11/2018 - 12:37

హైదరాబాద్: తెలంగాణలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేస్తూ ఇటీవల కొందరూ హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవటం, ఓటర్ల జాబితాను సిద్ధం చేయకపోవటాన్ని కోర్టు తప్పు పట్టింది.

10/11/2018 - 06:36

ఎలచ్చన్ ఎంటర్‌టైన్‌మెంటు!
=================

ఓటేరా.. అన్నిటికీ మూలం
ఆ నిజము తెలిసి మసలుకొనుట ఓటరు ధర్మం -2-
ఓటేరా.. అన్నిటికీ మూలం

నాటి నేత ఓటరుకు వొంగివుండెరా
నేటి నేత వోటరునే వొంచుతుండురా -2-
ఓటుమీద నమ్మకాన్ని వీడబోకురా
శక్తినెరిగి భవితకొరకు వాడుకొమ్మురా

ఓటేరా.. అన్నిటికీ మూలం

10/11/2018 - 06:39

హైదరాబాద్, అక్టోబర్ 10: ‘ఆ గట్టునుంటావా...ఈ గట్టుకొస్తావా’ తేల్చుకోవాల్సిన సమ యం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల టీడీపీ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ ‘ఈ మధ్యన ఓ సినిమా వచ్చింది...దాని పేరు ఏదో కానీ, అందులోని ఓ పాట నాకు బాగా నచ్చింది’ అన్నారు.

10/11/2018 - 06:33

కామారెడ్డి, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇంతే కాకుండా కామారెడ్డి అసెంబ్లీ పరిధిలో అప్పుడే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కురుక్షేత్రం మొదలైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ మధ్య రాజకీయ కురుక్షేత్రం మొదలైంది.

10/11/2018 - 06:32

ధర్మపురి, అక్టోబర్ 10: తెలంగాణలో ప్రసు తతం రాజకీయ నాయకులు ఆరోపణ, ప్రత్యారోపణలతో సహనం కోల్పోతున్నారు. గతంలో ఎన్న డూ లేని రీతిలో నాయకులు తీవ్ర స్థాయిల్లో పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం నిత్యకృత్యమవుతోంది. ఎన్నికల సమయాన రాజకీయ పక్షా లు, నాయకులు, అభ్యర్థులు విధిగా ప్రవర్తనా ని యమావళిని పాటించాల్సి ఉంటుంది.

10/11/2018 - 06:10

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, నమ్మకద్రోహాలు ప్రజలకు వివరించి చెబితే చాలు ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల్లోభాగంగా అమిత్ షా రెండో విడత హైదరాబాద్‌కు వచ్చారు.

Pages