S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/14/2018 - 05:55

సిద్దిపేట, అక్టోబర్ 13 : తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాలుప్రసాద్ యాదవ్ పార్టీ అక్కడ కనుమరుగైందని చెప్పారు. జార్ఖండ్ ప్రజలు ఆపార్టీని బీహార్ పార్టీగా ముద్ర వేశారన్నారు. నేడు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాపార్టీగా ముద్రపడిందని పేర్కొన్నారు.

10/14/2018 - 05:30

హైదరాబాద్, అక్టోబర్ 13: ముందస్తు ఎన్నికల్లో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమాగా అన్నారు. శనివారం దత్తాత్రేయ అధ్యక్షతన పార్టీ పట్టణ మేనిఫెస్టో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, విజయం సాధిస్తుందని అన్నారు.

10/14/2018 - 05:28

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ జన సమితి (టీజేఎస్)లో విశ్రాంత న్యాయమూర్తి రవీందర్ రెడ్డి శనివారం చేరారు. టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1600 మంది అమరులయ్యారని అన్నారు.

10/14/2018 - 05:25

హైదరాబాద్, అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు చివరిగా పోలింగ్ తేదీ వరకు తెలంగాణలో మద్యం షాపుల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ జలసౌధలో ఈసీ, ఎక్సైజ్, పోలీసుశాఖల ఆధ్వర్యంలో ఉమ్మడిగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

10/14/2018 - 05:32

హైదరాబాద్, అక్టోబర్ 13: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చిల్లరగావ్యవహరిస్తున్నారని ఆపద్దర్మ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఈ పర్యాయం కొడంగల్ నియోజకవర్గం నుండి ఓడిపోతారన్నారు.

10/14/2018 - 05:22

హైదరాబాద్, అక్టోబర్ 13: ముందస్తు ఎన్నికలకు ఉత్సాహంగా వెళ్ళిన టీఆర్‌ఎస్ గ్రాఫ్ రోజు, రోజుకూ పడిపోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు, అసమ్మతులు పెరిగాయని ఆయన శనివారం పార్టీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

10/14/2018 - 05:21

హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసిన అంశాలలో చాలా తప్పులున్నాయని, హైకోర్టును తప్పు దారి పట్టించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు, పార్టీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాలను ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా తప్పుపట్టారు.

10/14/2018 - 05:21

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అలక పాన్పు ఎక్కారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్‌ను కలిసి చర్చించారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని, అలా చేస్తే ఓట్లు చీలిపోయి, టీఆర్‌ఎస్‌కు లాభం చేకూరుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

10/14/2018 - 05:20

హైదరాబాద్, అక్టోబర్ 13: పాతబస్తీలోని అనేక నియోజకవర్గాల్లో పట్టు సాధించిన మజ్లిస్‌కి ఈసారి చెక్ పెట్టాలనే నేపంతో వివిధ పార్టీలు ఏకమవుతున్నాయి. పాతబస్తీలో గట్టిపట్టున్న మజ్లిస్‌ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గత గొనే్నళ్లుగా మహ్మద్ అమానుల్లా ఖాన్ అన్నివర్గాల ప్రజల ఓట్లతో విజయం సాధించి మేటి నేతగా మన్ననలు పొందారు.

10/14/2018 - 05:18

హైదరాబాద్, అక్టోబర్ 13: ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం వంటివని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ ఆపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు అన్నారు. దసరా పండుగ తర్వాత తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)ను ప్రకటిస్తామని ఆయన శనివారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఏకకాలంలో రుణ మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

Pages