S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

11/11/2017 - 20:04

భారత్, శ్రీలంక జట్ల మధ్య 1982లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 1985లో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో గెల్చుకుంది. 1986-87 సీజన్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. లంకపై భారత్‌కు అదే తొలి విజయం. ఆతర్వాత భారత్ వరుసగా మరో మూడు (1990, 1993, 1994) సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. 1997, 1998 సంవత్సరాల్లో జరిగిన రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి.

11/11/2017 - 20:00

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో బౌలర్లు రెండు వందలు లేదా అంతకు మించి పరుగులిచ్చిన సంఘటనలు ఐదు పర్యాయాలు నమోదయ్యాయి. ఒక ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులిచ్చిన రికార్డు భారత స్పిన్నర్ రాజేష్ చౌహాన్‌ది. 1997 కొలంబో టెస్టులో అతను 76 ఓవర్లు వేసి, కేవలం ఒక వికెట్ సాధించాడు. 276 పరుగులు సమర్పించుకున్నాడు.

11/11/2017 - 19:58

క్రికెట్ ప్రపంచంలో సచిన్ తెండూల్కర్‌ను మించిన బ్యాట్స్‌మన్ లేడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సూపర్ సచిన్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలోనూ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. లంకతో 25 టెస్టుల్లో 36 ఇన్నింగ్స్ ఆడిన అతను మూడు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, 1,995 పరుగులు సాధించాడు. లంకపై అతని అత్యధిక స్కోరు 203 పరుగులు.

11/11/2017 - 19:57

టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ భారత్‌పై కూడా అద్భుతంగా రాణించాడు. ఇరు జట్ల బౌలర్లలో వందకుపైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు. భారత్‌తో 22 మ్యాచ్‌లు ఆడిన అతను 105 వికెట్లు సాధించాడు. అనిల్ కుంబ్లే 74, హర్భజన్ సింగ్ 53 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

11/11/2017 - 19:55

భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇంత వరకూ జరిగిన టెస్టుల్లో, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సనత్ జయసూర్య రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1997 కొలంబో టెస్టులో అతను 578 బంతులు ఎదుర్కొని, 36 ఫోర్లు, రెండు సిక్సర్లతో 340 పరుగులు సాధించాడు. భారత ఓపెనర్ వీరేందర్ సెవాగ్ 293, మహేల జయవర్ధనే 275 పరుగులతో ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు.

11/11/2017 - 19:41

రికార్డు ధరకు బార్సిలోనా నుంచి ప్రత్యేకంగా పిలిపించుకున్న బ్రెజిల్ సాకర్ స్టార్ నేమార్ వల్ల పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పిఎస్‌జి)కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న అనుమానం వ్యక్తమవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఇన్నాళ్లూ పిఎస్‌జి చీఫ్ కోచ్‌గా తిరుగులేని పట్టును కొనసాగిస్తూ, ఆటగాళ్లను తన కనుసన్నల్లో ఉంచుకోగలిగిన ఉనాయ్ ఎమెరీకి నేమార్ రాకతో సమస్యలు మొదలయ్యాయి.

11/11/2017 - 19:39

ఇంగ్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు డానీ డ్రింక్‌వాటర్‌కు ఆలస్యంగా జ్ఞానోదయమైంది. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందో లేదో చెప్పలేంగానీ, పొరపాటు నిర్ణయం ఒక కెరీర్‌ను నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుందన్న వాస్తవం తెలిసిందంటూ ఇప్పుడు వాపోతున్నాడు. 1998లో ఇంగ్లాండ్ 3బి2 జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు, ఏదో ఒక పెద్ద క్లబ్ తనను పిలిచి మరీ కాంట్రాక్టు ఇస్తారన్న నమ్మకంతో దానిని తిరస్కరించాడు.

11/11/2017 - 19:37

సెయింట్ పియెర్‌కు గురు భక్తి చాలా ఎక్కువ. క్రీడల్లో ఎవరైనా టైటిళ్లు గెలిస్తే ఎగిరి గంతేస్తారు. అది తమ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా ఫోజులు కొడతారు. కొంత మంది కోచ్‌ల గురించి ప్రస్తావిస్తారు. కానీ, బాక్సర్ పియెర్‌కు కోచ్ పట్ల అభిమానం అధికం. ప్రపంచ మిడిల్‌వెయిట్ టైటిల్ పోరులో కేవలం నాలుగు నిమిషాల, 23 సెకన్లలోనే మైఖేల్ బిస్పింగ్‌ను నాకౌట్ చేసి విజయకేతనం ఎగరేశాడు.

11/04/2017 - 19:15

చెస్ లేదా చదరంగం ఎప్పుడు, ఎక్కడ మొదలైందో చెప్పడం కష్టం. అయితే భారతదేశంలో 9వ శతాబ్దంలో గుప్తుల సామ్రాజ్యం కొనసాగుతున్న కాలంలో చెస్ ఆడేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. అయితే, కాలక్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకోగా, ఫిడే ఆవిర్భావం తర్వాత ఏకీకృత నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు మొదట్లో క్వీన్ కదలిక కేవలం ఏదైనా ఒక మూలకు, ఒక అడుగుకు మాత్రమే పరిమితమయ్యేది.

11/04/2017 - 19:12

చిన్నప్పుడు విన్న పజిల్ చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. చెస్ బోర్డులోని మొదటి చదరంపై ఒకటి, రెండో చదరంపై రెండు, మూడో చదరంపై దానికి రెట్టింపు నాలుగు, నాలుగో చదరంపై ఎనిమిది.. ఈ విధంగా బియ్యం గింజలను పేర్చుకుంటూ వెళితే, 64వ చదరం పూర్తయ్యే సరికి ఎన్ని గింజలు ఉంచాలి? సమాధానం అతికొద్ది మందికే తెలిసి ఉంటుంది. ఆ మొత్తం 93,23,37,20,36,85,47,75,808 గింజలు.

Pages