S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

07/15/2017 - 23:08

క్రికెట్ ప్రపంచంలో రవి శంకర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.
జయధ్రద్ శాస్ర్తీ అని చెప్పినా అర్థం కాకపోవచ్చు.

07/15/2017 - 23:03

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవి శాస్ర్తీ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదా? ఎవరికివారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారా? బిసిసిఐకి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) జోక్యం చేసుకోవడం వల్లే, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోచ్ పేరును హడావుడిగా వెల్లడించారా?

07/15/2017 - 23:03

కోచ్, క్రికెటర్ల సంబంధాల్లో కొన్ని వైరుధ్యాలు తప్పవు. అనిల్ కుంబ్లే, కోహ్లీ విషయంలో ఇది రుజవైంది. ఇద్దరూ పరస్పరం విభేదించుకుంటున్నారన్న వార్త చాలాకాలంగా అభిమానులను వేధిస్తునే ఉంది. కుంబ్లే, కోహ్లీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, చాంపియన్స్ ట్రోఫీకి బయలుదేరే ముందే, ఆరు నెలలుగా వీళ్లిద్దరి మధ్య మాటల్లేవని వచ్చిన వార్తలు సహజంగానే భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.

07/15/2017 - 23:02

టోర్నీలు లేదా సిరీస్‌లు ఏవైనా, ఒక జట్టులో కెప్టెన్‌దే కీలక పాత్ర అవుతుందని, సమయానుకూలంగా అతను తీసుకునే నిర్ణయాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని కోహ్లీ వాదన. జట్టు జయాపజయాలకు కెప్టెన్‌నే బాధ్యుడ్ని చేస్తారని, అందుకే, నాయకుడికి తగినంత వెసులుబాటు ఇవ్వాలని అంటాడు.

07/15/2017 - 23:02

* స్కాట్‌లాండ్ గోల్ఫర్ రొరీ మెకిల్‌రోయ్ పేరును ఒక్కొక్కరు ఒక్కో రకంగా పలకడంతో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది.

07/08/2017 - 22:37

రన్నింగ్, సైక్లింగ్ కంటే మెరుగైన వ్యాయామంగా స్విమ్మింగ్‌ను పేర్కొంటారు. ఈత కొట్టినప్పుడు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పని చేస్తాయి. బేస్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలతో పోలిస్తే స్విమ్మింగ్‌కు రెట్టింపు శక్తి అవసరమవుతుంది. ఒక గంటసేపు ఈత కొడితే సుమారు 650 క్యాలరీల శక్తి ఖర్చవుతుంది.

07/08/2017 - 22:36

ఇంగ్లీష్ చానెల్‌ను ఈదడానికి అత్యంత సాహసం కావాలి. అంతులేని ఆత్మవిశ్వాసం, అనితర సాధ్యమైన కృషి, అద్భుతమైన ఫిట్నెస్ ఉండాలి. ఇన్ని లక్షణాలు కలిస్తేనే ఇంగ్లీష్ చానెల్‌ను ఈదడం సాధ్యమవుతుంది. మొట్టమొదట ఈ ఘనతను అందుకున్న స్విమ్మర్ కెప్టెన్ మాథ్యూ వెబ్. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన వెబ్ 1875 ఆగస్టు 25న డొవ్ నుంచి కలాల్స్ వరకు 26 మైళ్ల (41.83 కిలోమీటర్లు) దూరాన్ని అతను 22 గంటల్లో పూర్తి చేశాడు.

07/08/2017 - 22:36

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని డయానా న్యాద్ నిరూపించింది. అమెరికాకు చెందిన ఈ సుప్రసిద్ధ రచయిత్రికి స్విమ్మింగ్ అంటే ప్రాణం. హవానా (క్యూబా) నుంచి ఫ్లొరిడా వరకు 110 మైళ్లు (180 కిలోమీటర్లు) ఈదడానికి ఆమె ఒకటికాదు.. రెండు కాదు.. ఐదు పర్యాయాలు ప్రయత్నించింది. ప్రతిసారీ విఫలమైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. రెట్టించిన పట్టుదలతో శ్రమించింది. చివరికి తన 64వ ఏట ఆమె అనుకున్నది సాధించింది.

07/08/2017 - 22:35

స్విమ్మింగ్‌లో అన్నింటికంటే పురాతనమైన స్ట్రోక్ ఏది? ఈ ప్రశ్నకు అనేక అధ్యాయనాల తర్వాత బ్రెస్ట్ స్ట్రోక్‌గా నిపుణులు ఖాయం చేశారు. నీటిలోకి దూకిన వెంటనే, బ్రెస్ట్ స్ట్రోక్ ద్వారానే ముందుకు కదులుతారు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నాటికే స్విమ్మింగ్‌లో ఈ విధానాన్ని పాటించేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి.

07/08/2017 - 22:35

* ఊపిరి పీల్చుకోకుండా ఎంతసేపు ఉండవచ్చు? అర నిమిషం పూర్తవుతున్నదంటేనే ఊపిరి బిగబట్టడం కష్టమవుతూ వస్తుంది. ఒకటిరెండు నిమిషాలు అలాగే ఉండగలిగితే గొప్పే. అయితే, ఫ్రీ డైవర్లు ఊపిరి పీల్చుకోకుండా నీటిలో సుమారు పది నిమిషాల వరకూ ఉండగలరు. నిరంతర అభ్యాసంతోనే ఇది సాధ్యమవుతుంది. నీటిలో ఊపిరి బిగబట్టి ఎక్కువ సేపు గడిపిన ప్రపంచ రికార్డు స్టిగ్ సెవెరినె్సన్ పేరిట ఉంది.

Pages