S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

06/15/2017 - 22:19

హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు, గో రక్షణ చట్టం తీసుకురావాలని దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. అంతేగాక ఆవును వధించేవారికి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు పెంచాలని కూడా సిఫార్సు చేసింది.

06/15/2017 - 22:17

అనాదిగా ‘గోమాత’కు విశిష్ట స్థానం ఉంది. పురాణాల్లోనూ గోవును పూజించినట్లు ఆధారాలున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎవరి మత ఆచారాలు వారికి ఉంటాయి. ఎవరి మత ఆచారాలు, సంప్రదాయాల్లో మరో మతం వారు జోక్యం చేసుకోరు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్చ ప్రకారం ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఎవరు ఏమి తినాలనుకున్నా, మరొకరి అనుమతి అవసరం లేదు. అయితే హిందూ మత ఆచారం, సంస్కృతి ప్రకారం గోవుకు ప్రత్యేకమైన, విశిష్ట స్థానం ఉంది.

06/15/2017 - 22:15

గోవులను వధించడం, గోవులను రక్షించడం వంటివి చట్టపరిధిలోనే జరగాలి. గోవులను వధిస్తున్నారని, గోవులను హింసిస్తున్నారని అల్లర్లు సృష్టించడం మంచిది కాదు. గోవుల రక్షణకు చట్టం కొత్తగా తెచ్చిందేమి కాదు. ఇది పాత కాలం నాటి చట్టమే. అదేవిధంగా గోవులను వధించడమూ అంతే. అయితే ఇవి చట్టపరిధికి లోబడి జరిగితే అందరికీ మంచిది.

06/15/2017 - 22:14

ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ దేశ సంస్కృతిని, ఆచారాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు గోవధ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. గోవధ నిషేధంపై ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకున్నది కాదు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేశారు. రాజ్యాంగంలోనే గోవధ నిషేధం గురించి ఉంది. అయితే ఇంత కాలం అయినా దాన్ని అమలు చేయడం లేదు, కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.

06/15/2017 - 22:12

గోవధ తగదు.. హిందూ ధర్మాచారం ప్రకారం గోవును దేవతగా ఆరాధిస్తాం. అలాంటి దేవతని వధించరాదు. ఆర్గానిక్ ప్రకారం గోవు ఎంతో మంచిది. గోవు పంచకంతోపాటు, ఆవుపాలు ఎంతో ఉపయోగకరం. ఆవుపాలు లీటరు 120 నుండి 130 రూపాయల వరకు పలుకుతున్నాయి. గోవును రక్షించటం వల్ల భావితారాలకు ఎంతో మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగాను, దేశీయంగాను ఒంగోలు జాతి గిత్తలకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. అలాంటి గిత్తలు రావాలంటే మూలం ఆవులు కావాలి.

06/15/2017 - 22:11

ఆవు అనేది ఒక జంతువు మాత్రమే కాదు. సనాతన ధర్మంలో అదొక జీవన విధానం. భారతీయ వ్యవసాయ రంగంలో ఆవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గృహప్రవేశాలు తదితర శుభకార్యాల్లో కూడా దీన్ని తప్పని సరిగా వినియోగించుకుంటూ వస్తున్నాం. భారతీయ జీవనాడి అయన ఆవును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇప్పుడు మనకు కావలసింది గోవధ నిషేధం కాదు.. మనుషుల మనస్సుల్లో మార్పు.

06/15/2017 - 22:09

గొడ్డు మాంసంపై నిషేధం లేదని అంటారు... అలాంటప్పుడు గోవధ చట్టానికి అర్థం లేదు. అయినప్పటికీ గోవులను వధశాలకు తరలించడాన్ని నిషేధించినట్టు కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ప్రజలలో అపోహలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం గోవధ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అశాస్ర్తియమైన అవగాహనతో సంఘ్ పరివార్ అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

06/15/2017 - 22:08

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌కోసం అన్ని విధాలుగా దోహదపడే గోవుల సంరక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏమాత్రం సరిపోవు. ఇంకా కఠినతరమైన చట్టాలు అవసరం. గోవులు కేవలం ఒక్క వ్యవసాయానికే పనికి వచ్చే గిత్తలను అందించడమేకాదు కుల, మత, వర్గ, లింగ, వయో బేధాల కతీతంగా మనిషి ఆరోగ్యానికి ఆవుమూత్రం ఉపకరిస్తుంది. పలు వ్యాధులకు దారితీసే శరీరంలోని రక్తాన్ని ఆవుమూత్రం పూర్తిగా శుద్ధిచేస్తుంది.

06/15/2017 - 22:06

గోసంరక్షణ అనేది మన అందరి బాధ్యతగా గుర్తించాలి. ప్రతి ఒక్కరు గోసంరక్షణకు తమ వంతు కృషిచేయాలి. హిందువులకు గోమాత దైవంతో సమానం. ఈ విషయంలో ఎవరి మనోభావాలకూ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. గోమాతకు పురాణాల్లోనూ విశిష్టస్థానం ఉంది. మన పూర్వీకుల నుండి గోమాతను పూజిస్తుండటంతోపాటు గోవుద్వారా అనేక రూపాల్లో లాభం పొందుతున్నాం. అనాదిగా గోసంపదకు మన సంస్కృతిలో విశిష్టస్థానం ఉంది.

06/15/2017 - 22:05

గోమాతను వధించిన వారికి కఠిన శిక్షలు ఉండాలి. పవిత్రమైన గోమాతను వధించిన వారికి, లేదా హాని చేసేవారిపై నాన్‌బెయిల్ సెక్షన్ల కింద చట్టాలు చేయాలని హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. హైకోర్టు ఇప్పటికే నెల రోజులు గడువు ఇచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో చలనం లేదు. జూలై 9వ తేదీ వరకు హైకోర్టు చట్టాలకు సవరణలు చేసి గోవులను వధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Pages